టీడీపీ రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు.. లాస్ట్ మినిట్ మార్పుతో..!!
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఖరారయ్యారు. టీడీపీ నంచి ముగ్గురు.. జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలంతో ఈ నలుగురు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీజేపీకి ఈ సారి సీటు దక్కలేదు. జనసేన నుంచి లింగమేనని రమేశ్ పేరు పవన్ ప్రకటించారు. ఇక.. టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్ధుల విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. చివరి నిమిషంలో సామాజిక సమీకరణాలతో అభ్యర్ధుల ఎంపికలో ఫైనల్ డెసిషన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారి పేర్లు ఖరారయ్యాయి. జనసేన తన అభ్యర్థిగా లింగమనేని రమేశ్‌ను ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ తన ముగ్గురు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీశ్‌కు మరో అవకాశం దక్కడం దాదాపు ఖరారైంది. విద్యాసంస్థల అధిపతి 'భాష్యం' రామకృష్ణనూ పెద్దల సభకు పంపాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇక మూడో అభ్యర్థి ఎవరనే అంశంపైనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటు బీసీ - ఎస్సీ వర్గాల్లో ఎవరికి ఇవ్వాలనేది తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీసీ వర్గం నుంచి ఎంపిక చేసేట్లయితే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్‌కి... ఎస్సీ వర్గ నేతను ఎంపిక చేస్తే సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం దక్కనుంది. సానా సతీశ్ కు గతంలోనే రాజ్యసభకు అవకాశం ఇచ్చినా.. ఏడాదిన్నార కాలం మాత్రమే ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. దీంతో.. ఆయనకు మళ్లీ అవకాశమివ్వాలని నిర్ణయించారు. ఇందులో సామాజిక వర్గాల కోణమూ ఉంది.

చంద్రబాబు తుది కసరత్తు.. అభ్యర్దుల ఖరారు
జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేశ్‌ను తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో.. టీడీపీ కాపు సామాజిక వర్గానికి చెందిన సానా సతీశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీకి విధేయుడిగా ఉంటూ సేవ చేస్తున్న భాష్యం రామకృష్ణను పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు. ఒక దశలో... ఏలూరు ఎంపీ బరిలో ఆయనను నిలపాలని భావించారు. కానీ.. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అవకాశం దక్కలేదు. భవిష్యత్తులో న్యాయం చేస్తామని అప్పుడే ఆయనకు హామీ లభించింది. మూడో స్థానం బీసీ లేదా ఎస్సీకి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్... ఐ-టీడీపీ సారథిగా కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో ఎస్సీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం, వర్ల రామయ్యకే చాన్స్ లభిస్తుంది. వర్ల రామయ్యకు గతంలోనే ఛాన్స్ ఇవ్వాలని భావించినా.. చివరి నిమిషంలో కనకమేడల రవీంద్ర కుమార్ కు అవకాశం దక్కింది. దీంతో.. ఇప్పుడు వర్ల రామయ్య కు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ రోజు చంద్రబాబు అధికారికంగా పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లే ముగ్గురు పేర్లు ప్రకటించనున్నారు.













Click it and Unblock the Notifications