కొన్ని పైకి చెప్పలేం: పవన్ కళ్యాణ్-నంద్యాల ఉపఎన్నికపై వేణు మాధవ్
నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని, తటస్థంగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై నటుడు వేణు మాధవ్ స్పందించారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి తాను మద్దతు ఇవ్వనని, తటస్థంగా ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చెప్పారు. దీనిపై నటుడు వేణు మాధవ్ స్పందించారు.
చదవండి: రేపటి నుంచి హత్యారాజకీయాలు: రోజా సంచలనం, తన ఖాతాలో పడకుండా పవన్ కళ్యాణ్

కొన్ని పైకి చెప్పలేం
పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరు ఏమంటారని వేణుమాధవ్‌ను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన మాట్లాడుతూ.. కొన్ని కొన్ని విషయాలు పైకి చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉంటాయన్నారు.

ఆయన మనసు నిండా భూమా ఫ్యామిలీకే
పవన్ ప్రచారానికి రాకపోవచ్చు గానీ, భూమా ఫ్యామిలీకే సపోర్ట్ చేయాలని ఆయన మనసు నిండా ఉందని తన నమ్మకం అన్నారు. సినీ పరిశ్రమతో భూమా ఫ్యామిలీకి చాలా అటాచ్‌మెంట్ ఉందని వేణుమాధవ్ చెప్పారు.

భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయం
కాబట్టి, వాళ్లు బయటకు చెప్పకపోయినప్పటికీ అంతర్గతంగా చూస్తే వాళ్లందరూ భూమా బ్రహ్మానంద రెడ్డికే మద్దతు ఇస్తారని వేణు మాధవ్ అన్నారు. కచ్చితంగా, బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

వేల కొద్ది మెజార్టీ
భూమా బ్రహ్మానంద రెడ్డికి ముప్పై వేలు, నలభై వేలు.. ఇలా మెజార్టీ వస్తుందని వేణు మాధవ్ చెప్పారు. బ్రహ్మానంద రెడ్డిపై పోటీ పడుతున్న వారికి డిపాజిట్ కూడా దక్కదనే వార్తలు వింటున్నానని, శిల్పా మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

అందరి హృదయాల్లో
భూమా బ్రహ్మానంద రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టడం వంద శాతం ఖాయమని వేణు మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు అందరి హృదయాల్లో ఉన్నారని వేణు మాధవ్ చెప్పారు.
-
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications