రేపటి నుంచి హత్యారాజకీయాలు: రోజా సంచలనం, తన ఖాతాలో పడకుండా పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు మొదలవుతాయన్నారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటి నుంచి చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు మొదలవుతాయన్నారు.

నంద్యాల ఓటర్లు అమ్ముడుపోరు
చంద్రబాబు గజినీ ఇచ్చిన హామీలు గుర్తుండవని ఎద్దేవా చేశారు. మైనార్టీలను మోసం చేయాలని చూస్తున్నారని, నంద్యాల ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోరని ఆమె వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చినా వైసిపి వెంటే ఉంటారని రోజా ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుపై జగన్, రోజా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

అది తన ఖాతాలో పడకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్త
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తరఫున ప్రచారం చేస్తారని పలువురు భావించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన తటస్థంగా ఉంటానని ప్రకటించిన అంశంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఈ ఉప ఎన్నికలో టిడిపి ఓటమి ఖాయమన్న విషయం పవన్‌కు అర్థమైందని, ఓడితే ఆ అవమానం తన ఖాతాలో పడకుండా పవన్ అటువంటి ప్రకటన చేశారని చురకలంటించారు.

రేపటి నుంచి కుట్రలు, హత్యా రాజకీయాలు
నంద్యాల ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఉప ఎన్నికను ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి నంద్యాలలో చంద్రబాబు కుట్రలు, హత్యా రాజకీయాలు ప్రారంభమవుతాయన్నారు.

ఇప్పుడు రంగంలోకి చంద్రబాబు
అయితే చంద్రబాబు శని, ఆదివారాల్లో నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. జగన్ వ్యాఖ్యలను టిడిపి నేతలు తిప్పికొట్టడం పక్కన పెడితే, ఇప్పుడు ఏకంగా చంద్రబాబే నంద్యాల బరిలో అడుగుపెడుతున్నారు.

ముఖ్యమంత్రి రియాక్షన్ పైన చర్చ
జగన్ కూడా నంద్యాలలోనే ఉన్నారు. దీంతో జగన్, రోజా వ్యాఖ్యలకు నంద్యాల గడ్డ నుంచి చంద్రబాబు ఎలాంటి కౌంటర్లు వేస్తారో అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పడు ముఖ్యమంత్రి రియాక్షన్ పైనే అంతా చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications