వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్-పవన్ కళ్యాణ్ పోటాపోటీ: జనసేన చీఫ్ 'ఆ మాట', ఇక బాబుకు చిక్కులే!

ప్రత్యేక హోదా అంశం ఏపీలో రాజుకుంటోంది. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చేతులు దులుపుకోగా, తెలుగుదేశం పార్టీ మంచి ప్యాకేజీ అని సర్ది చెబుతోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రత్యేక హోదా అంశం ఏపీలో రాజుకుంటోంది. హోదాకు మించిన ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ చేతులు దులుపుకోగా, తెలుగుదేశం పార్టీ మంచి ప్యాకేజీ అని సర్ది చెబుతోంది. ఈ నేపథ్యంలో హోదా రంగంలోకి ఓ వైపు వైసిపి అధినేత జగన్, మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వచ్చారు.

జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని పవన్, జగన్ పిలుపునిచ్చారు. ఆర్కే బీచ్ వద్ద జరిగే పోరులో జగన్ ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పగా, పవన్ కళ్యాణ్ ట్వీట్లతో రెచ్చిపోయారు. ఆర్కే బీచ్ అంశం పవన్ వర్సెస్ జగన్‌గా కనిపించింది.

ఓ విధంగా ప్రత్యేక హోదా ఉద్యమం చేతుల్లోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్, జగన్ పోటీ పడినట్లుగా కనిపించింది. జగన్‌ను విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకొని వెనక్కి పంపారు. ఆయన హైదరాబాద్ వచ్చి మీడియా సమావేశంలో చంద్రబాబును నిలదీశారు. ఈ రోజు ఉదయం పవన్ మీడియా సమావేశంలో బీజేపీని దులిపారు.

ఇక్కడ ఓ విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేశారు. చంద్రబాబు కూడా పోరాడాలన్నారు. ఈ రోజు ఇరువురిని ఏకిపారేశారు. జగన్ మాత్రం బీజేపీని కాకుండా చంద్రబాబును ప్రధానంగా టార్గెట్ చేస్తుండటం గమనార్హం.

పోటా పోటీ బాబుకు చిక్కులు

ప్రత్యేక హోదా అంశంతో ఏపీలో ఇటు పవన్, అటు జగన్ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. అందుకే హోదా అనే మెట్టును ఉపయోగించుకుంటున్నాయి.

జగన్ - పవన్ కళ్యాణ్ ఆధిపత్య పోరుతో చంద్రబాబు ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికలు మరో రెండేళ్లే ఉన్నాయి. కాబట్టి ఉద్యమాన్ని జగన్, పవన్‌లు తీవ్రతరం చేయడమే కాకుండా, చేతుల్లోకి తీసుకునే వ్యూహాలు రచిస్తారు. ఏం జరిగినా అది చంద్రబాబుకు, బీజేపీకి ఇబ్బందే అంటున్నారు.

విమానాశ్రయంలో ఉద్రిక్తత

విమానాశ్రయంలో ఉద్రిక్తత

ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. ఇది తీవ్రఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది.

వాగ్వాదం

వాగ్వాదం

విమానాశ్రయంలోకి భారీస్థాయిలో ప్రవేశించిన పోలీసు బలగాలు వైసిపి శ్రేణుల్ని నిలువరించాయి. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు పలుమార్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జగన్‌ హైదరాబాద్‌నుంచి విశాఖకు గురువారం మధ్యా హ్నం నాలుగు గంటలకు చేరుకున్నారు.

పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

విమానం దిగగానే జగన్‌తోపాటు ఎంపీలు విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు తదితరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీన్ని నిరసిస్తూ జగన్‌ తదతరులు రన్‌వే మీదే బైఠాయించారు. ఆయనకు పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. ఇంతలోనే విమానాశ్రయంలోని పరిస్థితిపై సామాజిక మాధ్యమాల ద్వారా పలు వీడియోలు, ఫొటోలు బయటకొచ్చాయి.

జగన్ అసహనం

జగన్ అసహనం

జగన్‌ విమానం దిగగానే పోలీసులు అడ్డుకోవడంతో అసహనం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావంటూ పోలీసులపై ఆగ్రహించారు. తనను తాను కాబోయే ముఖ్యమంత్రిగా సంబోధించుకుంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రన్ వేపై బైఠాయించిన అనంతరం వీరంతా విమానాశ్రయం బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తోపులాట చోటు చేసుకుంది.

ప్రత్యేక హోదా కోసం..

ప్రత్యేక హోదా కోసం..

వచ్చిన వారిలో ఇద్దరు ఎంపీలున్నారు, ఆగమన ప్రాంతంలోకి కాకుండా మరోచోటికి తీసుకెళ్లారని, మీరు కిడ్నాప్‌ చేశారని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఎయిర్ పోర్టులోకి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు రాకూడదు కదా అని జగన్ పోలీసులపై మండిపడ్డారు.

ఏం చేయాలనుకుంటున్నారు..

ఏం చేయాలనుకుంటున్నారు..

బయటికెళ్లే ద్వారం ఎందుకు తెరవట్లేదు? మీరు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? ప్రయాణికులను రన్‌వే మీదే ఆపేస్తారా అని జగన్ ప్రశ్నించారు. ఎలా ప్రవర్తించాలో తెలియని వారు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎలా ఉన్నారయ్యా అంటూ ఆక్షేపించారు. ఇంకో రెండు సంవత్సరాల గడువు ఉందని, ఎవర్నీ మర్చిపోనని పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత సీపీ యోగానంద్ చర్చలు జరిపి.. జగన్ అండ్ కోను తిప్పి హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ వచ్చాక ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

బీజేపీపై మండిపడ్డ పవన్

బీజేపీపై మండిపడ్డ పవన్

పదేళ్లు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సమస్యలు గాలికొదిలేసి... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందునేమొన్నటి ఎన్నికల్లో తాను బీజేపీ, టిడిపిలకు మద్దతు ప్రకటించానని, గుజరాత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మోడీ ప్రధాని అయితే బాగుంటుందని.. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రచారం చేసానని, వారికి మద్దతుగా ప్రచారం చేసినప్పుడు నీకు రాజకీయాలు తెలుసా? అనుభవం ఉందా? అని ఎవరూ అడగలేదని, బీజేపీ నేతలు నాతో కర్ణాటక, తమిళనాడులోనూ ప్రచారం చేయించుకున్నారని, తన అభిమానులతో జెండాలు మోయించారని, ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మాత్రం నీకు రాజకీయాలు ఏం తెలుసు? అంటూ విమర్శిస్తున్నారని, ఇది అవకాశమవాదమన్నారు.

మూడేళ్లు ఇరుకున పెట్టలేదని..

మూడేళ్లు ఇరుకున పెట్టలేదని..

మూడేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ తాను అడగలేదని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడితే విభజనతో కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని, ప్రజలను ఇబ్బందులు పెట్టినట్లవుతుందని భావించానని, మోడీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అనుకున్నానని, కానీ ఆయన అన్ని విషయాల్లోనూ ఒంటెద్దు పోకడ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లు ఇరుకున పెట్టలేదని చెప్పడం ద్వారా.. ఇక ముందు ఆయన ఉద్యమించే అవకాశం కనిపిస్తోంది.

తమిళనాడు రాజకీయాలపై..

తమిళనాడు రాజకీయాలపై..

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలను శాసించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనిని పసిగట్టిన యువత ఆ పార్టీకి బుద్ధి చెప్పడానికే ఉద్యమబాట పట్టిందని, జల్లికట్టు ఉద్యమం కేవలం సంస్కృతి పరిరక్షణ ఉద్యమం కాదని, బీజేపీపై ఉన్న కోపంతో తమిళ యువత చేపట్టిన ఉద్యమం అని చెప్పారు.

వెంకయ్యను ఏకేసిన పవన్

వెంకయ్యను ఏకేసిన పవన్

ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఏపీకి హోదా పదేళ్లు కావాలని పార్లమెంటులో డిమాండ్‌ చేసిన వెంకయ్య.. అధికారంలోకి రాగానే అదేమీ సంజీవని కాదని వ్యాఖ్యానించడం దారుణం అని పవన్ అన్నారు. ఆయన రోజుకో మాట మాట్లాడుతుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ఆయన స్వర్ణభారత్‌ ట్రస్టుపై పెట్టిన శ్రద్ధ ప్రత్యేక హోదాపై పెడితే ఇప్పటికి ఈ సమస్య ఇప్పటికే తీరి ఉండేదని, మీ నిలకడ లేని మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు.. ప్రసాదించడానికి మీరేమన్నా దేవుళ్లా అని నిలదీశారు. పైనుంచి దిగొచ్చారా? మేమంతా మీ బానిసలమా?. రామ మందిరం గురించి పట్టించుకుంటారు గానీ.. నాలుగు కోట్ల ప్రజల సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారన్నారు.

చంద్రబాబుపై..

చంద్రబాబుపై..


చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంలో ఎందుకు వెనకడుగు వేశారో అర్థం కావడం లేదని, హోదా అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోవడం ఆయన నైతిక తప్పేనని, ఈ అంశంలో ఎందుకు కాంప్రమైజ్‌ కావాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పి తీరాలని, సింగపూర్‌ లాంటి రాజధానిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు.. సుజనాచౌదరి లాంటి వ్యక్తిని వెంటబెట్టుకుని తిరుగుతుండటం సిగ్గుచేటు అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వ్యక్తి నుంచి ఏం స్ఫూర్తి నేర్చుకోవాలన్నారు. రాయపాటి సాంబశివరాలుకు పోలవరం ప్రాజెక్టు అప్పగించారని, పోలవరం నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని తనకు సమాచారం వస్తోందన్నారు.

సంబంధం తెంచుకోవడం కష్టం కాదు

సంబంధం తెంచుకోవడం కష్టం కాదు

సమస్యలన్నింటినీ మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిష్కారం చూపాల్సి ఉందని, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన, ప్రజల కోసం కుటుంబాన్నే వదిలివచ్చిన తనకు మీతో సంబంధం తెంచుకోవడం కష్టమేమీ కాదని, ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటే ఎందుకు అడ్డుకున్నారని, వారికి కనీసం ఒక గంటైనా సమయం ఇస్తే నిరసన చేపట్ట ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారని, అనవసరంగా యువతను రెచ్చగొట్టడం సరికాదన్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan widens gap with TDP, demands probe into YS Chowdary business deals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X