డెడ్ లైన్: అప్పుడే పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయనున్నారా?

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీకి సంబంధించిన సైట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో కీలక ప్రకటన చేయనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీకి సంబంధించిన సైట్లో ఈ విషయాన్ని వెల్లడించారు.

చదవండి: జగన్‌తో చిరంజీవి భేటీ, వైసిపిలోకి వెళ్తారని ప్రచారం, అసలేం జరిగింది

ప్రస్తుతం జనసేన పార్టీ ప్రతినిధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారిగా ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేయనున్నట్లు ఆ పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

2018 మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో నిర్మాణం చేసుకుంటుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మొత్తం స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పవన్ కళ్యాణ్ త్వరలో కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.

Pawan Kalyan will make key announcement soon

2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజెపి, టిడిపిలకు మద్దతు పలికారు. ప్రత్యేక హోదా కోసమే ఆయన నాడు ఆ పార్టీల తరఫున ప్రచారం చేశారు. ఈ అంశంపై బిజెపి, టిడిపిలు యూ టర్న్ తీసుకోవడంతో ఆయన దానినే ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు.

వైసిపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ అంశమే కీలకంగా మారనుంది. పవన్ కూడా హోదా కోసం ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు.

హోదా కోసం ఇతరులతో కలిసేందుకు సిద్ధమవుతూనే... మరోవైపు, పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎంపికలు పూర్తయ్యాక కీలక ప్రకటన చేయాలని పవన్ డెడ్ లైన్ విధించుకున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+