ఈసారి పవన్ కల్యాణ్‌కు డిపాజిట్లు కూడా దక్కవు.. తేల్చేసిన కీలక నేత
మాజీ మంత్రి , వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్.కె. రోజా మరోసారి కూటమి ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని, కేవలం తన సినిమాల గురించే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. రోజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కి రైతుల సమస్యలు, మహిళల సమస్యలు, విద్యార్థుల సమస్యలు పట్టవు. ఆయన కేవలం తన సినిమాలైన 'హరిహర వీరమల్లు', 'ఓజీ'ల షూటింగ్‌లు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగినా స్పందించలేదని ఆరోపించారు. సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకే రాజకీయాల్లోకి వచ్చారా?" అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో పవన్‌కు డిపాజిట్లు కూడా దక్కవని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు తప్ప, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏం చేశారు? అని నిలదీశారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వంపై కూడా రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. "రెడ్ బుక్" అంటూ వైసీపీ నాయకులను భయపెట్టిన నారా లోకేష్‌కు, కూటమి నాయకులకు "డిజిటల్ బుక్" అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారిని, నాయకుడిని చట్టం ముందు నిలబెడతామని తెలిపారు.
ఎన్నికల హామీలను తుంగలో తొక్కి, అనంతపురంలో "సూపర్ సిక్స్" సభను సిగ్గులేకుండా నిర్వహించారని ఆమె విమర్శించారు. మహిళలకు ఇస్తానన్న రూ.1500 పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications