వీడియోలు, ఫోటోలతో జగన్ లక్ష్యంగా వృక్ష విలాపం రాసిన పవన్ కళ్యాణ్!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పదునైన విమర్శనాస్త్రాలను సంధిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మరో మారు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . రాష్ట్రంలో వైసిపి పాలనలో కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ మరొకసారి సోషల్ మీడియా వేదికగా ఏపీలో వృక్ష విలాపం వివరించారు.
వైసిపి పాలనలో వృక్షాలు కూడా వినిపిస్తున్నాయని పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలను, ఫోటోలను కూడా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్టుని ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని, అటువంటి కొబ్బరి చెట్లను సైతం సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో నిలువునా నరికేశారు అని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు.

తమిళనాడులో కూడా చెట్లను కుటుంబసభ్యుల మాదిరిగా చూసుకుంటారని, ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకున్నవాళ్ళు ఈ విషయం తెలుసుకుంటే మంచిదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వృక్షో రక్షతి రక్షితః అంటూ పోస్ట్ చేసిన పవన్ మనకు ఆశ్రయాన్నిచ్చే, ఆహారం అందించే చెట్లను మీరు రక్షించలేనప్పుడు చివరికి మీరు చేసిన కర్మఫలితం కేవలం ఏపీ సీఎంను మాత్రమే కాకుండా ఏపీ పరిపాలనలో భాగమైన ప్రతి ఒక్కరికి వస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2023
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.… pic.twitter.com/tLHGWn3FU2
ఏపీ సీఎం పర్యటనలో చెట్లను నరికివేసే అపూర్వ ప్రక్రియ చేపట్టారని సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు అందించిన పవన్ కళ్యాణ్ ఈ ఫోటోలు అమలాపురంలోనివి అంటూ చెట్లను నరికిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇదే సమయంలో చెట్లు, పుష్పాలు ఏం కోరుకుంటాయి అన్నదానిపై జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్పవిలాపం, మొక్కలకు ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలను గుర్తు చేశారు.
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి 'పుష్ప విలాపం' చదవనప్పుడు, జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు మీకు అర్థం కానప్పుడు, మొక్కలు మరియు చెట్లను గాయపరిచినప్పుడు అవి విలపిస్తాయి, ఆ కర్మ ఫలితం అనుభవించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వృక్ష విలాపం లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2023
An unprecedented procedure to cut trees while AP CM travels.
These photos are from Amalapuram.
When you don’t read ‘Pushpa Vilapam’ by Sri Jandyala Papayya Sastry’, When you don’t understand Jagadeesh chandrabose experiments ,how… pic.twitter.com/z7Qjv6f6ov
సీఎం కాకపోతే కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా విచక్షణారహితంగా చెట్లను నరికివేయవద్దని సంబంధిత అధికారులకు సూచించాలని పవన్ కళ్యాణ్ తన పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక ఈ పోస్ట్ లో పుష్ప విలాపంలోని ఒక పద్యమును పోస్ట్ చేసి జగన్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు.
-
టీడీపీ ఎంపీకి జగన్ బిగ్ ఆఫర్ - మారుతున్న లెక్కలు..!? -
YS Sharmila : "అవి గొడ్డలి"- జగన్ మావిగాన్ కు షర్మిల షాకింగ్ పంచ్..! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications