My First Vote for Janasena : జనసేన విన్నూత్న ప్రచారం ప్రారంభం-ఫ్యాన్స్ ను ఓటర్లు చేసేలా..

ఏపీలో గత ఎన్నికల్లో భారీ ఎత్తున ఎన్నికల జన సమీకరణ చేసినప్పటికీ వాటిని ఓట్లుగా మల్చుకోవడంలో విఫలమైన జనసేన పార్టీ.. ఈసారి మాత్రం అలాంటి తప్పిదాలనుంచి బయటపడాలనుకుంటోంది. ఇందులో భాగంగా పవన్ ఫ్యాన్స్ ను ఓటర్లుగా మార్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందే లక్ష్యంతో ఇవాళ ఓ విన్నూత్న కార్యక్రమం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలతో పాటు యువత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రచారం నిర్వహిస్తారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని, ప్రజల ఆలోచన విధానానికి ప్రతిబింబం ఓటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. చట్టసభల్లోకి తమ తరఫున ఎవరిని పంపించాలి అని నిర్ణయం ఓటు పైనే ఆధారపడి ఉంటుందని, ఈసారి రాష్ట్రంలో యువత వేసే ఓటు కీలకం కానుందన్నారు. వారి నిర్ణయమే వచ్చే ఎన్నికల్లో శిరోధార్యమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నాలుగు లక్షల మంది యువత కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారని, వారంతా మొదటి ఓటును తమ భవిష్యత్తును బంగారుమయం చేసే జనసేన పార్టీకి వేస్తారని ఆశిస్తున్నామన్నారు.

Pawan Kalyan

వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటును వినియోగించుకోనున్న యువతలో చైతన్యం నింపేలా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్త క్యాంపెయిన్ ను నేటి నుంచి మొదలుపెట్టింది. "My First Vote for JANASENA" పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ చైతన్య కార్యక్రమాన్ని నిరంతరాయంగా యువతలోకి తీసుకువెళ్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో గురువారం My First Vote for JANASENA క్యాంపైన్ పోస్టర్లను కళాశాల విద్యార్థులతో కలిసి మనోహర్ ఆవిష్కరించారు.

Pawan Kalyan

విద్యార్థులతో మాట్లాడి మీ మిత్రులు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని, మొదటి ఓటును జనసేన పార్టీకి వేసి మీ బలమైన సహకారం అందించాలని ఆయన కోరారు. భవిష్యత్తు తరాల గురించి ఎంతో ఉన్నతమైన ఆలోచన చేసే పవన్ కళ్యాణ్ అడుగుజాడలు యువతకు ఎంతో స్ఫూర్తి అన్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలను అందిపుచ్చుకునే యువతరం రాష్ట్రంలో ఉన్నారని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా, ఒక ఉన్నతమైన దారిని ఏర్పాటు చేసేలా ఆయన నిత్యం ఆలోచిస్తారన్నారు. అలాంటి నాయకుడికి అండగా నిలిచేలా వచ్చే ఎన్నికల్లో మొదటి ఓటు వేయనున్న యువత జనసేన పార్టీకి అండగా నిలబడాలన్నారు. వారి మద్దతు జనసేన పార్టీకి మరింత బలం తీసుకొస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+