పవన్ ను మెప్పించిన మహిళా కలెక్టర్..! పొగడ్తల జల్లు...!
ఏపీలో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారి ఎమ్మెల్యే, మంత్రి, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేస్తున్న పవన్ కల్యాణ్ తన శాఖతో పాటు ఇతర శాఖల అధికారులతో కూడా కాస్త గంభీరంగానే మాట్లాడతారు. సమీక్షలు నిర్వహించినా, ఆదేశాలు ఇచ్చినా సున్నితంగానే ఇస్తుంటారు. ఇక వారి గురించి ఎక్కువగా మాట్లాడినట్లు ఎక్కడా కనిపించరు. కానీ ఇవాళ మాత్రం ఓ అధికారిని, అందులోనూ మహిళా కలెక్టర్ ను పవన్ ఆకాశానికెత్తేశారు.
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మెగా పీటీఎం కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటూ.... తెలుగు భాషను ప్రోత్సహించేందుకు స్థానిక కలెక్టర్ కృతికా శుక్లా చేస్తున్న కృషిని గమనించారు. దీంతో అనంతరం జరిగిన సభలో పవన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలెక్టర్ కృతిక హర్యానా నుంచి వచ్చినా ఇక్కడ మన భాష గురించి పడుతున్న తపనను పవన్ గుర్తించారు. తెలుగు భాషపై ఆమెకున్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.

కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతుంటే, "మీరు ఇక్కడే పుట్టారా?" అని తాను అడిగానని పవన్ తెలిపారు. "పక్క గుంటూరు-విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నాను, కానీ ఆమె 'లేదు, లేదు... మాది హర్యానా' అని చెప్పారు" అని తెలిపారు. మన మాతృభాషను నేర్చుకోవడానికి మనం ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చినప్పటికీ, ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.

తెలుగు భాష పట్ల కృతికా శుక్రా చూపిన అభిమానానికి, పిల్లలకు భాషను అర్థమయ్యేలా వివరించడానికి ఆమె పడుతున్న శ్రమకు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి మన మాతృభాషపై ఉన్న గౌరవంపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి దృష్టిని ఆకర్షించాయి.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!












Click it and Unblock the Notifications