పిఠాపురంలో పవన్ కు షాకిచ్చిన వర్మ ? టీడీపీ ట్రేడ్ మార్క్ తో..!

ఏపీలో గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపులో టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ పోషించిన పాత్ర అసాధారణమైనది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో వర్మ పవన్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో పవన్ కు రాష్ట్రమంతా పర్యటించి కూటమి అభ్యర్ధుల కోసం ప్రచారం చేసుకునే వీలు కలిగింది. దీనికి ప్రతిగా కూటమి అధికారంలోకి వచ్చాక వర్మకు తొలి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చినా అలా జరగలేదు. ఈ నేపథ్యంలో వర్మ తన రాజకీయం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి కూటమి ప్రభుత్వం 183 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి నిర్ణయం తీసుకుంది. అయితే డొక్కా సీతమ్మ పేరుతో కూడా భవిష్యత్తులో క్యాంటీన్లు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే అందరికంటే ముందు పవన్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ నేత వర్మ గతంలో వైసీపీ ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించేశారు. పవన్ తో ఎలాంటి సంబంధం లేకుండా వర్మ ఈ క్యాంటీన్ ప్రారంభించారు. దీన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసారు.

pawan kalyan s supporter tdp leader svsn varma relaunches anna canteen in pithapuram

వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఇందులో తప్పేమీ లేకపోయినా ప్రభుత్వం ఆగస్టు 15న ఒకేసారి అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో, పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్ ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలో వర్మ ఇలా సొంతంగా అన్న క్యాంటీన్ ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఏదేమైనా పేదోడికి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేసిన పనే కావడంతో అంతా ఆయన్ను అభినందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+