టిజి వెంకటేష్ కు పవన్ వార్నింగ్, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలేది లేదు : బాబు మీద ఫైర్..!
టిడిపి రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ కు వపన్ కళ్యాన్ వార్నింగ్. టీడిపి - జనసేన కలిసేందుకు అవకాశాలు మెండు గా ఉన్నాయన్న టిజి వ్యాఖ్యల పై పవన్ సీరియస్ అయ్యారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హె చ్చరించారు. టిజి తో పాటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము హత్యకు చంద్రబాబే కారణమని తీవ్ర ఆరోపణలు చేసారు..

టిజి కి జనసేనాని వార్నింగ్..
ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసిన తరువాత టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేసా రు. ఏపిలో టిడిపి- జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎస్పీ, బీఎస్పీ కలిసిన ప్పుడు...టీడీపీ, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు. దీంతో..ఈ వ్యాఖ్యలు ఇటు టిడిపిలో అటు జనసేనలో కలకలం సృష్టించాయి. దీని పై విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. టిడిపి - జనసేన పొత్తు పై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడవద్దని పవన్ వార్నింగ్ ఇచ్చారు. పెద్ద మనిషివని గౌరవం ఇచ్చి మాట్లాడుతన్నామన్నారు.

నేను వద్దనుకున్న రాజ్యసభ సీటు...
టిజి పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాన్ అదే సమయంలో తాను వద్దనుకుంటే వచ్చిన రాజ్యసభ సీటును తెచ్చు కున్న టిజి వెంకటేష్ కు బుద్ది చెబుతానని సీరియస్ అయ్యారు. పారిశ్రామిక వేత్తగా నదులను పర్యవరణాన్ని కలుషి తం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. నేను నోరు అదుపు తప్పితే మీరు ఏమవుతారో నాకు తెలియదంటూ హెచ్చరించారు . గతంలోనే చంద్రబాబు పవన్ తమతో కలిసి రావాలని ఆహ్వానించారు. ఆ సమయంలోనే పవన్ సీయం ఆహ్వానాన్ని తిరస్కరించారు. తాము వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు టిడిపి ఎంపి టిజి చేసిన వ్యాఖ్యలతో పార్టీ డామేజ్ చేసేందుకే అని భావించిన పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ముఖ్యమంత్రి పైనా ఫైర్..
జనసేన అధినేత పవన్ కళ్యాన్ విశాఖ పర్యటనలో ఉన్నారు. టిజి వెంకటేష్ వ్యాఖ్యల పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పవన్..అదే సమయంలో ముఖ్యమంత్రి మీదా తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోము చనిపోవడానికి ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు. దీని ద్వారా టిజి వెంకటేష్ లాంటి వ్యక్తులు తాను టిడిపి తో పొత్తు పెట్టుకుంటాననే వార్తల కు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నెల 26న జనసేన నుండి పోటీ చేసే అభ్య ర్ధుల తొలి లిస్టును ప్రకటించేందుకు పవన్ సిద్దం అవుతున్నారు. దీంతో..ఇక, జనసేన పై వచ్చే విమర్శలను అదే స్థాయిలో తిప్పి కొట్టాలని పవన్ భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర లో పార్టీ నియామకాల పై పవన్ దృష్టి పెడుతున్నారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications