Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుంటా అంటున్న జనసేనాని ... అందుకే సరికొత్త వ్యూహం

Recommended Video

    భీమవరంలో పర్యటించాలని పవన్ నిర్ణయం || Pawan Kalyan Decided To Visit Bhimavaram Constituency Shorty

    ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేన పార్టీలో నైరాశ్యం నెలకొంది. ఇక దానికి చెక్ పెట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. తాను పోటీ చేసి ఓటమి పాలైన భీమవరంలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ నేతలు పవన్ ఓటమితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంటికే పరిమితమయ్యారు. భీమవరంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి పార్టీని ముందుకు నడిపించటానికి పవన్ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

    ఓడిన చోటు నుండే జనసేనాని పర్యటన .. భీమవరం శ్రేణుల్లో ఉత్సాహం

    ఓడిన చోటు నుండే జనసేనాని పర్యటన .. భీమవరం శ్రేణుల్లో ఉత్సాహం

    గత ఎన్నికల్లో పవన్ ఓటమితో భీమవరంలో జనసేన పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కంచుకోటగా భావించారు. కానీ అక్కడ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. ఏకంగా జనసేన అధినేతనే ఓటమి పాలు చేశారు భీమవరం ప్రజలు. దీంతో పవన్ ఇక భీమవరం వంక చూడరని భావించారు. కానీ పవన్ భీమవరం నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చేనెల మొదటివారంలో పవన్ భీమవరంలో పర్యటించి పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు కోల్పోయిన అభిమాని కుటుంబసభ్యుల్ని పరామర్శిస్తారని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి పర్యటనలు చేయలేదు. అయితే తాజాగా ఆయన పోటీ చేసి ఓడిపోయిన భీమవరం నియోజకవర్గంలోనే పర్యటించాలని నిర్ణయించుకోవటం భీమవరం శ్రేణులలో కాస్త జోష్ నింపింది.

    జనసేన క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకే భీమవరం పర్యటన ..

    జనసేన క్యాడర్ కు భరోసా ఇచ్చేందుకే భీమవరం పర్యటన ..

    ఇక గత ఎన్నికల్లో భీమవరంలోని స్థానిక నాయకత్వ లోపం వల్లే జనసేనాని ఓటమిపాలయ్యారు అనేది ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం. ఇక ఆ తర్వాత భీమవరంలో జనసేన పార్టీ కనుమరుగయ్యింది అన్న పరిస్థితి నుండి భీమవరంలో పార్టీని బలోపేతం చెయ్యటంపై జనసేనాని దృష్టి సారించారని తాజా నిర్ణయంతో అర్ధం అవుతుంది. ఎవరికి వారు ఇంటికి పరిమితమై, తమ సొంత వ్యవహారాలను చూసుకుంటున్న వారు పవన్ వస్తున్నారు అన్న వార్త తెలిసి ఉత్సాహంతో ఉన్నారు. ఇక సెప్టెంబర్ లో జరిగే మున్సిపల్ ఎన్నికలపై క్యాడర్ దృష్టి సారించాలని భావిస్తోంది. పార్టీని బలోపేతం చెయ్యటం పై దృష్టి పెట్టిన పవన్ తాజాగా పార్టీ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయా కార్యకర్తలు, నేతలతో చర్చలు జరుపుతున్నారు.

     పార్టీ నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా నాయకులతో భేటీ .. పవన్ దిద్దుబాటు చర్యలు

    పార్టీ నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా నాయకులతో భేటీ .. పవన్ దిద్దుబాటు చర్యలు

    సోమవారం నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్ కళ్యాణ్ భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక నేడు ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులతో భేటీ కానున్న పవన్, మంగళవారం సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులతో సమావేశం కానున్నారు . ఈనెల 31న అంటే బుధవారం ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశం జరగనుంది. మొత్తానికి పార్టీని బలోపేతం చెయ్యాలనే ఆలోచనే కాకుండా పోయిన చోటే వెతుక్కోవాలనే ఆలోచన పవన్ కు రావటం అందుకే కొత్త వ్యూహంతో అక్కడ నుండే తన పర్యటన ప్రారంభించటం జనసేనలో జోష్ నింపుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+