జగన్ వర్సెస్ పవన్ -ఎవరిది పై చేయి : మద్దతుగా రాని మెగా హీరోలు: ఛాంబర్ నిర్ణయం -తెర వెనుక..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం సంచలనంగా మారింది. అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే అంశం రెండు రోజులుగా చర్చ సాగుతోంది. పవన్ కామెంట్స్ .. .మోహన్ బాబు స్పందన..విరుచుకుపడిన ఏపీ మంత్రులు..చివరగా ఫిల్మ్ ఛాంబర్ స్పందనతో ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి ట్రాప్ లో ఎవరు చిక్కుకున్నారు.. పవన్ వర్సెస్ ప్రభుత్వంలో ఎవరిది పై చేయి సాధించారనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెన్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు.

పవన్ వర్సస్ ఏపీ ప్రభుత్వం
తీవ్ర పదజాలంతో పవన్ విరుచుకుపడ్డారు. మంత్రి పేర్ని నానిని సన్నాసి అంటూ కామెంట్ చేసారు. ముఖ్యమంత్రి జగనజ్ పైన ఆరోపణలు గుప్పించారు. తన మీద కోపంతో సినీ ఇండస్ట్రీని వేధించవద్దని సూచించారు. అదే సమయంలో మోహన్ బాబు పైన సెటైర్లు వేసారు. ఇక, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన మంత్రులు వరుసగా రంగంలోకి దిగారు. మంత్రులు వెల్లంపల్లి, బొత్సా, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్ స్పందించారు. ఇక, పేర్ని నాని ఏ మాత్రం తగ్గకుండా పవన్ మాట్లాడిన మాటలకు ప్రతీ దానికి అదే తరహాలో సమాధానం చెప్పారు.

మద్దతుగా ముందుకు రాని హీరోలు
అయితే, మంత్రులు పవన్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న సమయంలో నాని..సంపూ..బ్రహ్మాజీ..కార్తికేయ మాత్రమే పవన్ కు మద్దతుగా నిలిచారు. సినీ ఇండస్ట్రీలోని సీనియర్లు..మెగా హీరోలు సైతం పవన్ కు మద్దతుగా ముందుకు రాలేదు. జనసేన వర్సెస్ వైసీపీ వ్యవహారాల్లో వారు ఇప్పటి వరకు జోక్యం చేసుకోలేదు. కానీ, ఇది సినిమా ఇండస్ట్రీ పైన పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వంగా వ్యవహారం మారింది. అయితే, అప్పటికే లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ వేదికగా చిరంజీవి సైతం ఏపీ సీఎం..మంత్రులను ఇదే అంశాన్ని నివేదించారు. పరిశ్రమను ఆదుకోవాలని కోరారు.

చిరంజీవి పైన వ్యాఖ్యలతో
దానికి ఏపీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ..చిరంజీవి అంటే సీఎంకు సోదర భావమని వ్యాఖ్యానించారు. కానీ, ఇక్కడ పవన్ తీరు తో మాత్రం ఏపీ ప్రభుత్వం విభేదించింది. అయితే, పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో చిరంజీవి కి కొన్ని సూచనలు చేసారు. చిరంజీవిని ఆరాధించే పవన్ ఎప్పుడూ తన అన్న గురించి పల్తెత్తు మాట అనలేదు. కానీ, ఈ సందర్భంలో మాత్రం చిరంజీవి కి మంచి మనసు ఉందని..అందుకే అంతగా ప్రాధేయ పడుతూ అడిగారని పవన్ చెప్పుకొచ్చారు. అదే సయంలో చిరంజీవికి అంత వంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పండి...ప్రాధేయ పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

ఇండస్ట్రీ పెద్దలను ప్రశ్నించిన ఏపీ ప్రభుత్వం
ఎవరినో చిరంజీవికి చెప్పండి అనటం మెగా అభిమానుల్లో చాలా మందికి రుచించలేదనే చర్చ సాగుతోంది. ఇక, మోహన్ బాబు సైతం మా ఎన్నికల తరువాత స్పందిస్తానని చెప్పటం ద్వారా మరో ఎపిసోడ్ మిగిలి ఉందనే విషయం అర్దం అవుతోంది. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ వివాదంలో వ్యూహాత్మకంగా వేసిన అడుగు ఫలితం ఇచ్చింది. పవన్ చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం ఎక్కడైనా సినిమా పరిశ్రమను వేధిస్తుందా..దీనికి సినీ పెద్దలు ఖచ్చితంగా స్పందించాలంటూ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేసారు. అది కూడా పదే పదే ప్రస్తావించారు.

అవి వ్యక్తిగతమంటూ ఫిల్మ్ ఛాంబర్
వకీల్ సాబ్ కు ఏపీలో వసూళ్ల మొదలు..ఎన్ని సినిమా హాల్స్ నడుస్తున్నాయనే వివరాల వరకు బయట పెట్టారు. దీంతో..తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో పెద్దలు చర్చలు జరిపినట్లు సమాచారం. తమకు రెండు ప్రభుత్వాల సహకారం కావాలని చెబుతూనే..పవన్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని తేల్చి చెప్పాయి. ఫలితంగా పవన్ వ్యాఖ్యలు రాజకీయ కోణంలోనే చూడాలి..పరిశ్రమ అభిప్రాయం కాదనే విధంగా వారి ఖండన కనిపిస్తోందనే వాదన మొదలైంది.
Recommended Video

మా ఎన్నికల తరువాత సెకండ్ ఎపిసోడ్
పవన్ వాదనకు మద్దతు లభించకపోవటం..ఛాంబర్ నుంచి స్పష్టమైన ప్రకటన రావటంతో ప్రభుత్వం తమ వ్యూహం ఫలించినట్లుగానే భావిస్తోంది. ఇదే సమయంలో పవన్ ఒక్క సారిగా రాజకీయ టర్న్ తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పైన ట్విట్టర్ వార్ ప్రారంభించారదు. ఈ ఉదయం ప్రభుత్వ పధకాల అమలు తీరు పైన టార్గెట్ చేస్తూ పోస్టింగ్ లు పెట్టారు. అయితే, ఈ వ్యవహారం ఇప్పటితో ముగిసిందా లేక మా ఎన్నికల తరువాత మరో సారి రచ్చకు కారణమవుతుందా అనేది చూడాలి.












Click it and Unblock the Notifications