పెళ్లయిన మూడు రోజులకే భర్తను తట్టుకోలేక భార్య జంప్.. ఓటీటీలోకి కొత్త సినిమా..

ఈ రోజుల్లో చిన్న సినిమాలదే హవా నడుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేక పోతున్నాయి. అందుకే గతేడాది చిన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేశాయి. రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంభాల లాంటి చిత్రాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ఈ ఏడాది కూడా కపుల్ ఫ్రెండ్లీ లాంటి కొన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. వాటిలో పాపం ప్రతాప్ మూవీ ఒకటి. టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తనదైశ కథలతో ప్రేక్షకుల్ని అలరించడంలో ముందుటాడు. మసూద, పరేషాన్, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో లాంటి సినిమాలతో తిరువీర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

తిరువీర్ హీరోగా ఇటీవల విడుదలైన చిత్రం 'పాపం ప్రతాప్'.. ఈ చిత్రంలోని సరికొత్త స్టోరీ లైన్ కారణంగా ఈ మూవీపై ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో రిలీజ్ కు ముందే సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఏప్రిల్ 17 న విడుదలైన ఈ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించింది. అలాగే కలెక్షన్స్ కూడా మంచిగానే రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ పక్కా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కింది. స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉంటుంది.

PapamPratap Heading to OTT ETV Win to Stream the Film Starting May 7 Papam Pratap OTT release date

ప్రతాప్(తిరువీర్) తన ఫ్రెండ్ బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి ప్రతాప్ తండ్రికి ఇష్టం లేకపోయినా కొడుకు కోసం ఒప్పుకుంటాడు. అయితే పెళ్లయిన మూడోరోజే ప్రతాప్ నిద్రలో ఉన్న వింత సమస్య కారణంగా బుజ్జమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అయితే ప్రతాప్ తన మానసిక సమస్యను అధిగమించాడా..? తిరిగి తన భార్య బుజ్జమ్మను ఇంటికి తెచ్చుకున్నాడా..? అనేది స్టోరీలైన్. పాపం ప్రతాప్ సినిమా చాలా సరదాగా సాగుతుంది. చివరిలో ఎమోషన్ కూడా బాగానే వర్క్ అవుట్ అయింది. థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన ఈ మూవీ మే 7 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+