విజయ్ పథకాలకు ఎన్ని వేల కోట్లు కావాలి?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలే ఆయుధంగా విజయ్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే, అధికారం చేపట్టిన మొదటి ఏడాదిలోనే ఆ హామీల అమలుకు అదనంగా రూ.42,000 కోట్లు అవసరమవుతాయని ఆర్థిక నిపుణుల అంచనా. ఇప్పటికే రూ.1.22 లక్షల కోట్ల ద్రవ్య లోటుతో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ఈ భారీ తాయిలాలు మోయలేని భారంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

విజయ్ మేనిఫెస్టోలో అత్యంత ఆకర్షణీయమైన హామీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం. ప్రస్తుతమున్న రూ.1,000 నగదు బదిలీని రూ.2,500కి పెంచుతామని ఆయన ప్రకటించారు. దీనివల్ల వార్షిక కేటాయింపులు రూ.14,411 కోట్ల నుండి ఏకంగా రూ.36,029 కోట్లకు పెరుగుతాయి. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే రాష్ట్రంపై రూ.21,617 కోట్ల అదనపు భారం పడనుంది.

Vijay Welfare Challenge Can Tamil Nadu Afford Rs 42000 Crore Additional Burden for Manifesto Promises

ఉచిత విద్యుత్ - పెన్షన్ల సెగ

విద్యుత్ రంగంలో 100 యూనిట్ల ఉచిత పథకాన్ని 200 యూనిట్లకు విస్తరించడం వల్ల సబ్సిడీ ఖర్చులు రూ.12,000 కోట్లకు చేరుతాయి. ఇది ప్రభుత్వానికి అదనంగా రూ.4,248 కోట్ల భారాన్ని మోపుతుంది. ఇక వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లను రూ.3,000కి పెంచడం వల్ల మరో రూ.8,800 కోట్లకు పైగా ఖర్చు పెరుగుతుంది. వీటికి తోడు సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీకి రూ.7,074 కోట్లు, రైతులకు రూ.15,000 ఆర్థిక సాయం కోసం మరో రూ.1,941 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

విజయ్ జాతకం.. నాలుగేళ్ల క్రితమే చెప్పిన పండిట్!
విజయ్ జాతకం.. నాలుగేళ్ల క్రితమే చెప్పిన పండిట్!

ఆదాయం ఎక్కడ? అప్పులే శరణ్యమా?

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న వ్యయంలో వేతనాలు, పెన్షన్లు మరియు వడ్డీ చెల్లింపులే అత్యధికంగా ఉన్నాయి. జాతీయ సగటు 35 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో ఈ 'కట్టుబడి ఉన్న వ్యయం' (Committed Expenditure) చాలా ఎక్కువ. దీనివల్ల సామాజిక రంగాలపై వ్యయం చేసే సామర్థ్యం 42 శాతం నుండి 34 శాతానికి పడిపోయింది. కేంద్రం నుండి అదనపు నిధులు లేదా ప్రత్యేక ప్యాకేజీలు లేకుండా ఈ హామీలను నెరవేర్చడం విజయ్ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు
ఫ్రీ బస్సు పెట్టు.. సీఎం సీటు పట్టు

సవాళ్లు - ప్రత్యామ్నాయాలు

కేవలం అప్పుల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తే, రాష్ట్ర ద్రవ్య లోటు పరిమితులు దాటి ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. వనరుల సమీకరణ కోసం కొత్త పన్నులు విధించడం లేదా మద్యం అమ్మకాలపై ఆధారపడటం వంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. నిరుద్యోగ భృతి వంటి పథకాలకు కఠిన నిబంధనలు విధిస్తే తప్ప, ఆర్థిక క్రమశిక్షణను కాపాడటం విజయ్‌కు కత్తిమీద సామే కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+