టీ తీర్మానం రావాల్సిందే: రాష్ట్రపతికి పయ్యావుల లేఖ

ఆర్థిక మంత్రి చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసిన సందర్భంలో రాజ్యాంగం ప్రకారమే విభజన జరుగుతుందని తెలిపారని పయ్యావుల చెప్పారు. దేశంలో ఏర్పడిన ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతందని చిదంబరం చెప్పినట్లు పయ్యావుల తెలిపారు. ప్రస్తుతం కేంద్రం చేపడుతున్న విభజన ప్రక్రియలో అనేక లోటుపాట్లు ఉన్నాయని అన్నారు.
అల్ప సంఖ్యాకుల నుంచి ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చినప్పడు శాసనసభ అభిప్రాయం తీసుకోవాలని జస్టిస్ పూంచ్ కమిటీ పేర్కొందని ఆయన తెలిపారు. రాజ్యాంగం ప్రకారం శాసనసభలో తీర్మానం చేయకుండా విభజన ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 స్ఫూర్తిని గుర్తించాలని ఆయన అన్నారు.
విభజన విషయంలో రాజ్యాంగ స్ఫూర్తికి, అంబేద్కర్ ఆలోచనలకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా విభజన ప్రక్రియ కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. విభజన విషయంలో ప్రణాళిక సంఘాన్ని కూడా సంప్రదించలేదని ఆయన అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమాన్ని అవమానించేలా కేంద్రంలోని నాయకులు వ్యవహరిస్తున్నారని పయ్యావుల ఆరోపించారు.












Click it and Unblock the Notifications