మొన్న లడ్డు కల్తీ - నేడు తొక్కిసలాట, ఏం జరుగుతోంది..!!

తిరుపతిలో తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. చంద్రబాబు ఇప్పటికే ఘటనా స్థలిని పరిశీలించారు. పవన్, జగన్ తిరుపతి వస్తున్నారు. ఈ ఘటన పైన కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మరణించటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారుల పై చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు మరణించిన వారికి పరి హారం పెంచాలని కోరుతున్నాయి. ఇక, మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట ఘటనలతో అసలు ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.

టీటీడీ పై విమర్శలు
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు అయ్యారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ముందస్తు చర్యలు లేక ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి వచ్చిన చంద్రబాబు అక్కడ అధికారుల సమన్వ యం పైన మండిపడ్డారు. బాధ్యత లేకుండా పని చేస్తున్నారని సీరియస్ అయ్యారు. స్విమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. కాసేపట్లో పవన్, జగన్ తిరుపతి చేరుకుంటారు.

రూ కోటి చెల్లించాలి
ఈ ఘటన పైన పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వెళ్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గోవింద నామాలు ప్రతిధ్వనించా ల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష వినిపిస్తోందని మండిపడ్డారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శ నమని ఫైర్ అయ్యారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై నైతిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని షర్మిల పేర్కొన్నారు.

PCC Chief YS Sharmila targets AP Govt and TTD over stampede in Tirupati demands 1 cr compensation

చర్యలు తీసుకోవాలి
చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని చెప్పుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేసారు. వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం చంద్రబాబును కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట ద్వారా కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని షర్మిల వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల ప్రభుత్వాన్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+