ఆ పాకిస్తానీయుల్ని వెనక్కి పంపద్దు-కేంద్రానికి మొహబాబా కీలక వినతి..!
కశ్మీర్లో పహల్గాం దాడి ఘటన తర్వాత భారత్-పాక్ మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. అలాగే పరస్పరం ప్రత్యర్థులపై కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. పాకిస్తాన్ మద్దతుతో ఉగ్రదాడికి పాల్పడ్డ వారి విషయంలో తీసుకునే చర్యల విషయంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా కేంద్రం తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం విషయంలో మాత్రం పునరాలోచించాలన్న వినతులు వస్తున్నాయి.
వహల్గాం దాడి తర్వాత కేంద్రం భారత్ లో నివసిస్తున్నపాకిస్తాన్ పౌరులందరినీ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే వారి వీసాల్ని రద్దు చేసింది. ఇంకా వివిధ రాష్ట్రాల్లో ఉన్న వారిని ఏరివేసి వెంటనే పాకిస్తాన్ కు పంపేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారు. అయితే వీరిలో కొందరు భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్థానీలు ఉన్నారు. వీరి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఇవాళ కేంద్రానికి ఇదే వినతి చేశారు. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తానీయుల్ని మాత్రం వెనక్కి పంపొద్దని ఆమె కోరారు. ఈ విషయంలో కేంద్రం ఇప్పటికే తీసకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆమె కోరుతున్నారు. భారతీయుల్ని పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ పౌరులు ఇప్పటికే చాలా ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నారని ఆమె గుర్తుచేశారు.
The recent government directive to deport all Pakistani nationals from India has raised serious humanitarian concerns, particularly in Jammu & Kashmir. Many affected are women who came to India 30–40 years ago, married Indian citizens, raised families, and have long been part of…
— Mehbooba Mufti (@MehboobaMufti) April 29, 2025
భారతదేశం నుండి పాకిస్తాన్ జాతీయులందరినీ బహిష్కరించాలని ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రమైన మానవతా ఆందోళనలను లేవనెత్తాయని ఆమె తెలిపారు. 30-40 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన మహిళలు, భారత పౌరులను వివాహం చేసుకున్నవారు, కుటుంబాన్ని పెంచుకున్నవారు చాలా మంది కేంద్రం నిర్ణయం బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇప్పుడు వారిని ఉన్నట్లుండి తరిమేయడం వారి కుటుంబాల్లో చిచ్చు రేపినట్లవుతుందన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications