అన్నీ రూపాయి షేర్లే.. మంట పుట్టించాయి

స్టాక్ మార్కెట్ల జోరుకు బ్రేకులు పడ్డాయి. మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పతనంతో 65 వేల 300 మార్కు ఎగువన, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ మాత్రం 140 పాయింట్లు పడిపోయి 19 వేల 350 మార్కు వద్ద నిలిచాయి. BSE కన్జూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ టాప్ గెయినింగ్ సెక్టార్‌గా నిలిచింది. మరోవైపు BSE పవర్ ఇండెక్స్ మాత్రం పడిపోయింది. BSE నమోదిత షేర్లలో మొత్తం 1352 పెరగ్గా.. మరో 1901 డౌనయ్యాయి. 132 షేర్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. BSE దగ్గర నమోదైన కంపెనీల మార్కెట్ విలువ రూ.301 లక్షల కోట్లుగా ఉంది.

ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, టైటాన్ కంపెనీ, హెచ్‌‌డీఎఫ్‌సీ లైఫ్ రాణించాయి. అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా, బజాజ్ ఫినాన్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు డౌనయ్యాయి. మార్కెట్లు నష్టపోతున్నా వీటితో సంబంధం లేకుండా కొన్ని పెన్నీ స్టాక్స్ అద్భుత పనితీరు కనపరిచాయి. అప్పర్‌ సర్క్యూట్‌లో లాకైన 5 షేర్ల గురించి తెలుసుకుందాం. కచ్చితంగా వీటిని వాచ్ లిస్టులో చేర్చుకోవాలంటే స్టాక్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. Rathi Steel And Power Ltd, parvati Sweetners and Power Ltd, Cinerad Communications Ltd, Pacheli Industrial Finance Ltd, sri Adhikari Brothers Television Network Ltd షేర్లు అదరగొట్టాయి.

stock7

అలాగే సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ (Suzlon Energy Limited) కంపెనీ షేరు సంవత్సరం వ్యవధిలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. 2022 జులై 6న ఈ కంపెనీ షేరు విలువ రూ. 6.06 వద్ద ఉండగా.. 2023 జులై 6వ తేదీకి రూ. 17.15 శాతానికి చేరింది. అంటే ఈ ఏడాది కాలంలో 176 శాతం పెరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+