జగన్ దీక్షకు అనుమతి నిరాకరణ: చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన వైసిపి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఈ నెల 26న గుంటూరులో తలపెట్టిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షకు పోలీసుల అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని పోలీసులు అనుమతివ్వలేదు.

దాంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ యంత్రాంగం సందిగ్ధంలో పడింది. ఇప్పటికే జగన్ దీక్షకు దాదాపుగా అన్ని ఏర్పాట్లను పార్టీ యంత్రాంగం పూర్తి చేసింది. ప్రభుత్వం కావాలనే దీక్షకు అనుమతి నిరాకరిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
వైయస్ జగన్ దీక్షను భగ్నం చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చాంద్ బాషా, విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వైయస్ జగన్ పేరు వింటేనే చంద్రబాబు భయపడిపోతున్నారని వారు వ్యాఖ్యానించారు.
వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అందుకు కేంద్రానికి మద్దతు ఉపసహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications