పవన్ కు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్ - మేము తగ్గేదే లే..!!

పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీకి చేసిన హెచ్చరిక పై ఆ పార్టీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. పవన్ బెదిరింపులకు వైసీపీలో ఏ ఒక్కరూ భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న ఘటనల పైన పవన్ స్పందించకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలు జనసేన కేడర్ పైన దాడులు చేస్తుంటే వారి మానసిక క్షోభ పవన్ కు పట్టదా అని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీసారు. పవన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు.

ఉప ముఖ్యమంత్రి తాజాగా వైసీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పైన పేర్ని నాని ఘాటుగా స్పందించారు. అధికారం లేకపోయినా వైసీపీ జెండా మోసిన కార్యకర్తలు దర్జాగా బతుకుతుంటే, జనసేన కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు జనసేన కార్యకర్తలతో కాళ్లు పట్టిస్తున్నారని, కొడుతున్నారని..పవన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి వైసీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు వేధించే వారికి తాము పది రెట్లు తిరిగి అధికంగా ఇస్తామని హెచ్చరించారు. అధికార మదంతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.

Perni Nani counter Pawan Kalyan over his warn for YSRCP cadre

ఎంత కొట్టినా, తిట్టినా వైసీపీ జెండా మోయకుండా ఎవరూ ఆపలేరన్నారు. తమ పార్టీ కార్యకర్తల చిత్తశుద్ది అలాంటిదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. అయినా.. వైసీపీ కార్యకర్తలు భయపడే వారు కాదని చెప్పారు. చంద్రబాబు, పవన్ తమ తల్లికి, చెల్లికి ఆస్తులు ఇచ్చారా అని పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎంత మంది చెల్లెళ్లు ఉన్నారో ఎవరికైనా తెలుసా అంటూ నాని ఎద్దేవా చేసారు. తమకు ఎన్ని సీట్లు ఎన్నా లేకపోయినా పోరాడుతామని చెప్పుకొచ్చారు. వైసీపీ శ్రేణులను ఎంత వేధించినా తగ్గేదే లేదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా..వైసీపీ జెండాను వదలి పెట్టరని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+