చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందలాగా టీడీపీ మహానాడు: పేర్ని నాని

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఏపీలో వైసీపీ పాలనను టార్గెట్ చేస్తూ చంద్రబాబు వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మహానాడు మొత్తం చంద్రబాబు ఆత్మస్తుతి, పరనిందలాగే జరుగుతుందని పేర్ని నాని విమర్శించారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై బురదజల్లడమే తప్పా, వైయస్ జగన్ ధనిక సీఎం అంటూ తప్పుడు ప్రచారం చేయడం తప్పా చంద్రబాబు చేసేది ఏదీ లేదని పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు. వయసు మీద పడ్డ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కావడం లేదని, కార్యకర్తలకు సుత్తి కబుర్లు చెబుతున్నారు అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు.

perni nani counter to chandrababu comments in tdp mahanadu

టిడిపి సైకిల్ గుర్తును ఎన్టీఆర్ సృష్టించినప్పుడు చంద్రబాబు హస్తం పార్టీ కింద కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నాడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పార్వతిని అడ్డుపెట్టుకొని రామోజీరావు తో కలిసి కుట్రలు కుతంత్రాలు పన్నిన చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని, సైకిల్ గుర్తును లాగేసుకున్న నీచుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

వెన్నుపోటు పొడిచిన చేతులతోనే ఎన్టీఆర్ చిత్రపటానికి దండ వేసి దండం పెట్టడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా ఉన్న చరిత్ర చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. జగన్ ఆస్తులపై మాట్లాడిన చంద్రబాబు తన ఆస్తుల లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు వెయ్యి కోట్లని రెండెకరాల నుంచి చంద్రబాబు వెయ్యి కోట్లు ఎలా గడించాడో చెప్పాలని నిలదీశారు.

చంద్రబాబు చేసిన వ్యాపారాలు ఏమిటి? హెరిటేజ్ కంటే ముందు చంద్రబాబు ఏం చేసాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా చంద్రబాబు హెరిటేజ్ సంస్థ పరుగులు పెట్టింది? అంటూ అనేక ప్రశ్నలను సంధించారు. నయవంచక శకుని వేషధారి చంద్రబాబేనని, ఎన్టీఆర్ దగ్గర ఆషాఢభూతి వేషం వేసింది చంద్రబాబు అని పేర్ని నాని మండిపడ్డారు. ఓట్లు అవసరం రాగానే జనం దగ్గర వేషాలు వేసే సంస్కృతి చంద్రబాబుకే ఉందని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల్లో అందర్నీ వాడుకుని వదిలేసే తప్పుడు రాజకీయ నేత వేషం కూడా చంద్రబాబుదేనని పేర్ని నాని విమర్శించారు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ప్రజల ముందు నక్క వినయాలు ప్రదర్శించే గుంటనక్క చంద్రబాబు అంటూ మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో అధికారమిస్తే పేదలను కోటీశ్వరుడు గా చేస్తానంటున్న చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉండి ఎంత మంది పేదలను కోటీశ్వరులను చేసాడో చెప్పాలని ప్రశ్నించారు.

బాబు బతుకంతా తప్పుడు లెక్కలేనని మండిపడ్డారు. మళ్లీ అధికారం కట్టబెట్టాలని అడగడానికి సిగ్గు ఉండాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని రేపు అధికారమిస్తే చేస్తాం అనే మాట చెప్పడానికి సిగ్గు లేదా బాబు అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ప్రజల కోసం తీసుకువచ్చిన బాబు మార్కు పథకం ఒక్కటైనా ఉందా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని పిల్లిమొగ్గలు చేసినా ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు అధికారం రానే రాదు.. ఇది రాసి పెట్టుకో వలసిన వాస్తవం అంటూ మాజీ మంత్రి పేర్ని నాని తేల్చిచెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+