బాలినేని Vs పేర్ని నాని - కీలక మలుపు...!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ వీడిన నేతలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. అటు సోదరి షర్మిల ఆస్తుల వివాదంలో జగన్ ను టార్గెట్ చేస్తోంది. ఇటు వైసీపీ సైతం ఆ విమర్శలను కౌంటర్ చేస్తోంది. తాజాగా జగన్ బంధువు.. ప్రస్తుతం జనసేన లో ఉన్న బాలినేని చేసిన వ్యాఖ్యల పైన పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల కోసం బాలినేని ఏదైనా మాట్లాడుతారని వ్యాఖ్యానించారు.
బాలినేని వ్యాఖ్యల పై
వైసీపీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని తాజాగా చేసిన వ్యాఖ్యల పైన వైసీసీ స్పందించింది. జగన్- షర్మిల ఆస్తుల వివాదం పైన బాలినేని కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరూ ఆస్తుల కోసం గొడవ పడుతూ వైఎస్ ఇమేజ్ కు నష్టం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇద్దరూ విజయమ్మ చెప్పినట్లు నడుచుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యల పైన పేర్ని నాని రియాక్ట్ అయ్యారు. బాలినేని చెప్పినట్లు విజయమ్మ చెప్పినట్లుగా నడుచుకోవాలంటే..జడ్జి స్థానంలో ఉన్నవారు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు. వైసీపీ వద్దని వెళ్లిపోయిన బాలినేని ఇప్పుడు పెద్దమనిషి అవతారం ఎందుకు ఎత్తారని ప్రశ్నించారు.

ఏదైనా మాట్లాడుతారు
రాజకీయాల కోసం బాలినేని ఏదైనా మాట్లాడుతారని.. ఇప్పుడు జనసేనలో ఉండటంతో ఆ పార్టీ లైన్ మాట్లాడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని డబ్బాలు కొట్టి, ఇప్పుడు రూ.6 వేల కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. కూటమి పాలనలో నిత్యావసరాల ధరలు బాదుడే బాదుడు అని పేర్ని నాని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్టే చార్జీలు పెంచామని చంద్రబాబు అంటున్నారని, కోర్టు ఆర్డర్ చూపించాలని డిమాండ్ చేశారు.
అప్పులు చేసారు
సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ఐదు నెలల్లో 47 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందని అన్నారు. జగన్ పాలనలో సృష్టించిన సంపదను చంద్రబాబు తన మనుషులకి దోచి పెడుతున్నారని చెప్పుకొచ్చారు. పేరుకే ఉచిత ఇసుక అంటూ హడావిడి చేస్తున్నారని, అసలు ఎక్కడైనా ఉచితంగా ఇస్తున్నారా అని పేర్ని నాని అన్నారు. గతంకంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేట్లని ఇసుక అమ్ముతున్నారని చెప్పారు. కాకినాడలో అక్రమ బియ్యం అంటూ హడావిడి చేశారు ఇప్పుడు ఆ హడావిడి ఏమైందని పేర్ని నాని నిలదీశారు.












Click it and Unblock the Notifications