గుడివాడలో కొడాలి నాని ఎంట్రీ.."ఎవడొస్తాడో రండ్రా"
ఉమ్మడి కృష్ణాజిల్లా రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి, ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా జరిగే మాటల యుద్ధాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంటాయి. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని మరింత హీటెక్కించారు. మరో మూడు నెలల్లో కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని వస్తున్నాడని అన్నారు. గుడివాడలో అడుగుపెడతాడు, ఎవడొస్తాడో రండ్రా.. అండర్ వేర్ మీద నిలబెట్టడానికి అంటూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్లు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
ఇదే సమయంలో మంత్రి కొల్లు రవీంద్రపై కూడా పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. కొల్లు రవీంద్ర పెద్ద నటుడని, చంద్రబాబు కేబినెట్ లోనూ, సెక్రటేరియట్‌లో సగం మంది ఇదే విషయం మాట్లాడుకుంటున్నారని నాని పేర్కొన్నారు. తండ్రీ కొడుకు ఇద్దరినీ పట్టేశాడని అంతా అనుకుంటున్నారు. చూస్తే ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు కానీ ఇన్ని కలలు ఉన్నాయా అంటూ ఎద్దేవా చేశారు.

తనపై వస్తున్న 'చీకట్లో నరికేయండి' వంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. అలా అనను, అనాలంటే పట్ట పగలే చేసేయాలని చెబుతానని, తన సంస్కారం అలాంటిది కాదని స్పష్టం చేశారు. పేర్ని నాని చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాజకీయ వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలియజేస్తున్నాయి. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రాంతంలో మాటల యుద్ధాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు నిత్యకృత్యమయ్యాయి. ఈ సంచలన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. గుడివాడ రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠ భరితంగానే ఉంటుందనడానికి ఇది మరో నిదర్శనం.












Click it and Unblock the Notifications