పెట్రోల్ బంకుల్లో మోసాన్ని ఇలా గుర్తించండి

పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బండిలో కొట్టించుకున్నప్పటికీ చిన్న అంసతృప్తి మాత్రం అలాగే ఉండిపోతుంది. వీళ్లు సరిగానే కొట్టారా? నేను చెప్పినట్లు రెండు లీటర్లు వచ్చిందా? తూకంలో మనకు తెలియకుండా అంకెల్లో ఏమైనా మోసం చేస్తున్నారా? తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నారా? రూ.100 పెట్రోలు కొట్టమన్నాను.. చూపించడానికి మాత్రం చూపించిందికానీ ఆ రూ.100 పెట్రోల్ వచ్చిందా? లేదంటే తకరారు ఏమైనా జరుగుతోందా? అనే అనుమానం ప్రతి వినియోగదారుడిని వెంటాడుతుంటుంది.

ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇటువంటి సందేహాలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. మనం బంకుల్లో పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు ఎంత డబ్బులు చెప్పాము? ఎంత కొడుతున్నారు? ఎన్ని లీటర్లు చెప్పాము? ఎన్ని లీటర్లు వస్తోంది? అని చూసుకోవడానికి ఎలక్ట్రానిక్ డిస్ ప్లే తో కూడిన మిషన్ ఉంటుంది. బండి తీసుకొని పెట్రోలు బంకుకు వెళ్లిన ప్రతిసారీ అదే అనుమానం. అయితే ఎలక్ట్రానిక్ డిస్ ప్లే లో ఉండే డెన్సిటీ వల్ల క్వాలిటీ తెలుసుకోవచ్చు.

petrol and diesel Quality can be determined by density

డెన్సిటీ 710 నుంచి 770 వరకు ఉంటే పెట్రోలు నాణ్యమైందని అర్థం. ఎక్కువున్నా, తక్కువున్నా నాణ్యత లేదని, బంకువారు ఏదో తకరారు చేస్తున్నారని భావించవచ్చు. అలాగే డీజిల్ కు 820 నుంచి 860 వరకు ఉంటే నాణ్యమైన డీజిల్ అని అర్థం వస్తుంది. అంతకు ఎక్కువున్నా, తక్కువున్నా బండి దెబ్బతినడంతోపాటు మైలేజ్ తగ్గుతుంది. వేరే పెట్రోల్ బంకుకు వెళ్లి కొట్టించుకోవాలి.. లేదంటే ఈ బంకువారు ఇలా చేస్తున్నారంటూ [email protected] చిరునామాకు మెయిల్ పంపించాలి. దీన్నిబట్టి వాళ్లు యాక్షన్ తీసుకుంటారు. వాస్తవానికి డెన్సిటీని కూడా మార్చొచ్చు.. కదా అనే సందేహం చాలామందికి వస్తుంది. కానీ దాన్ని మార్చడానికి వీలుకాదు. బంకుల్లో మిషన్ ను సెట్ చేసేటప్పుడే కంపెనీవాళ్లు అలా సెట్ చేస్తారు. దీంతో నిరభ్యంతరంగా మనం కొట్టించుకునే పెట్రోలు, డీజిల్ క్వాలిటీతో ఉందా? లేదా? అని తెలుసుకోండి. లేకపోతే ఫిర్యాదు చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+