పెట్రోల్ బంక్‌ల మూసివేతతో హైరానా, క్యూలు (పిక్చర్స్)
హైదరాబాద్: అకస్మాత్తుగా హైదరాబాదు, సికింద్రబాద్ జంటనగరాల్లోని పెట్రోల్ బంకులు సోమవారంనాడు మూత పడ్డాయి. దీంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు తమపై అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ పెట్రోల్ బంక్‌ల యజమానులు సమ్మెకు దిగారు. అయితే, మధ్యాహ్నానికి సమ్మె విరమణ జరిగింది.
పెట్రోల్ బంక్ యజమానులకు, తూనికలూ కొలతల శాఖ అధికారులకు మధ్య జరిగిన చర్యలు సఫలమయ్యాయి. అంతకు ముదు పెట్రోల్ బంక్ యజమానులు సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. పెట్రోల్ బంక్‌లో తెరుచుకోవడంతో వినియోగదారులు వాహనాలతో పెద్ద యెత్తున క్యూలు కట్టారు. హైదరాబాద్, సికింద్రబాబ
తమపై అన్యామంగా దాడులు నిర్వహిస్తున్నారంటూ ఆదివారం నుంచి మెరుపు సమ్మెకు దిగిన పెట్రోల్ బంకులపై సోమవారం ఉదయం మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు నమోదయ్యింది. అరుణ్‌కుమార్ అనే న్యాయవాది హెచ్ఆర్సీలో పెట్రోల్ బంకులపై ఫిర్యాదు చేశారు.
మెరుపు సమ్మెకు దిగి అత్యవసర సేవలకు విఘాతం కల్గిస్తున్న పెట్రోల్ బంకులను పౌరసరఫరాల శాఖ ఆధీనంలోకి తీసుకోవాలంటూ ఆయన ఫిర్యాదులో కోరారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వానికి, పెట్రోల్ బంకు సంఘాలకు మధ్య చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది అరుణ్‌కుమార్ తన పిటీషన్‌లో కోరారు.

తప్పదు మరి..
పెట్రోల్ బంకులన్నీ మూతపడడంతో సచివాలయం వద్ద గల ప్రభుత్వ బంక్ వద్ద టూ వీలర్స్, ద్విచక్ర వాహనాలు క్యూ కట్టాయి. తప్పదు కదా మరి..

ప్రభుత్వ బంకే గతి...
సచివాలయం వద్ద ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నడిపే పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంకులన్నీ మూతపడడంతో ఇక్కడ రద్దీ విపరీతంగా పెరిగింది.

ఇలా తప్పలేదు..
సోమవారం ఉదయం పెట్రోల్ బంకులు మూతపడడంతో ప్రజలపై అనుకోని దెబ్బ పడింది. బైక్‌ను ఇలా నడిపించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

సైడ్ బిజినెస్ ఇలా..
పెట్రోల్ బంకులు మూత పడడంతో సీసాల్లో పెట్రోల్ నింపి సైడ్ బిజినెస్ కూడా చేశారు. వారికి భలే గిరాకీ ఉన్నట్లే ఉంది.

పెట్రోల్ బంకుల వద్ద రద్దీ..
పెట్రోల్ బంకుల వద్ద రద్దీ చెప్పనలవి కాకుండా ఉంది. ముందుగా తెలియకపోవడంతో చాలా మంది వాహనాల్లో పెట్రోల్ నింపుకోలేకపోయారు. దాంతో ఈ రద్దీ.

ప్లాస్టిక్ సీసాలతో క్యూలు..
పెట్రోల్ లేకపోవడంతో వాహనాలను తేలేక ఇలా ప్లాస్టిక్ సీసాలను పట్టుకుని వినియోగదారులు బంకుల్లో క్యూ కట్టారు.

పెట్రోల్ కోసం పడిగాపులు..
వాహనాలు లేకపోతే కదలలేని స్థితిలో జంటనగరాల ప్రజలు పెట్రోల్ బంకు వద్ద ఇలా చేరిపోయారు.

అయ్యో ఇదేం కర్మ..
ఓ మహిళ తన బిడ్డను చంకలో పెట్టుకుని పెట్రోల్ కోసం ప్లాస్టిక్ సీసాతో ఇలా నిలబడింది. అయ్యే ఇదేం కర్మ అని అనుకుంటూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications