ఏపీకి రప్పిస్తానని చంద్రబాబు ధీమా, బేగంపేటలో అడుగు (పిక్చర్స్)
హైదరాబాద్: ఆరు రోజుల జపాన్ పర్యటనను చంద్రబాబు బృందం శనివారంతో ముగించింది. రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలంటూ జపాన్‌లోని తెలుగువారికి చంద్రబాబు పిలుపునిచ్చారు. వారంపాటు ఏకధాటిగా జరిగిన జపాన్ యాత్రలో చివరి రోజు ఆయన అక్కడి తెలుగువారితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రాన్ని, రాజధానిని ఒక మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కలిసి రావాలని విజ్ఞప్తి చేవారు. ముందుగా చంద్రబాబుకు జపాన్ ఎన్నారైలు పౌర సన్మానం చేశారు. ఇన్నాళ్లూ విద్య, వైద్యం కోసం ఇతర దేశాలకు వెళ్లేవారు ఉన్నారని, రానున్న రోజుల్లో ఇతర దేశాల నుంచి ఆంధ్రకు వచ్చేవారు ఉంటారని ఈ సందర్భంగా బాబు ప్రకటించారు.
ఆ రోజు ఎంతోదూరంలో లేదని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధికి కట్టుబడి ఉందని, జపాన్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. పర్యటన ముగించుకున్న చంద్రబాబు బృందం శనివారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. నేరుగా ఢిల్లీలో దిగిన చంద్రబాబు అక్కడి నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు నేరుగా అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు.

చంద్రబాబు
భారీ అంచనాలతో జపాన్ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటన సంతృప్తికరంగా సాగినట్టు భావిస్తున్నారు.

చంద్రబాబు
రాజధాని నిర్మాణంలో జపాన్ సాంకేతిక సహకారం తీసుకోవడం, పెట్టుబడులను ఆకర్షించడం ధ్యేయంగా చంద్రబాబు ఆరురోజులపాటు జపాన్‌లో పర్యటించారు.

చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన పదుల సంఖ్యలో పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. హిటాజి, ఇసుజీ, ఇసెకీ, తోషిబా, క్యుటోబా, ఎన్‌ఎంబిసి, సాఫ్ట్‌బ్యాంకు వంటి వారితో విస్తృతంగా చర్చలు జరిపారు.

చంద్రబాబు
జైకావంటి ఆర్ధిక సంస్థలతోనూ చర్చించి రాష్ట్రంలో మరిన్ని ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు. ఆయా సంస్థలు కూడా సానుకూలంగానే స్పందించడంతో చంద్రబాబు ఉత్సాహంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

చంద్రబాబు
ఇదే సమయంలో ఆ దేశ ప్రధాని అబెతో భేటీ కావడం, రాష్ట్రంలో, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన సానుకూలంగా స్పందించి హామీనివ్వడం కూడా విశేషం.

చంద్రబాబు
రాష్ట్రంలో గతంలోఉన్న పరిస్థితులు లేవని, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, అనుమతులు కూడా వారం రోజుల్లోగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు చేసిన ప్రకటన జపాన్ సంస్థలు ముందుకు వచ్చేందుకు ఆస్కారం కల్పిస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు.

చంద్రబాబు
ఇదే సమయంలో రాజధాని నిర్మాణంలో కీలక అంశాలపై కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తయారు చేసేందుకు, మరో 13 పట్టణాలను మెగా సిటీలుగా మార్చేందుకు కూడా సహకారం అందిస్తామని జపాన్ ప్రకటించారు.

చంద్రబాబు
అలాగే రాజధాని ప్రాంతంలో కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న ద్వీపాలను పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేసేందుకు కూడా కొన్ని సంస్థలు సహకరిస్తామని ముందుకు వచ్చారు.

చంద్రబాబు
మొత్తం మీద తన పర్యటన విజయవంతమైందని, త్వరలోనే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications