హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబులా కష్టపడాలన్న నరసింహన్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బాగా కష్టపడి పని చేస్తారు, ఆయనలాగా మీరు కూడా కష్టపడాలని టిడిపి ఎమ్మెల్యే, ఎంపీలకు గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. మీరు చేతులు కలపాలని, జట్టుగా ఆయనకు సహకరించాలని సూచించారు.

పార్టీ నుండి గెలుపొందిన ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు సోమవారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో టిడిపి ప్రజాప్రతినిధుల భేటీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.

తాను కేంద్ర హోంశాఖలో ఉన్నప్పుడు విఐపిల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించానని, ఆ సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తమ నేత బాబుకు భద్రతను తగ్గించారని ఎర్రనాయుడు తమ దృష్టికి తీసుకురాగా భద్రతను పెంచేందుకు చర్యలు తీసుకున్నానని గుర్తు చేశారట. ఈ సమయంలో నరసింహన్ టిడిపి అధినేతకు మిఠాయి తినిపించారు. పట్టుబట్టి మరీ గవర్నర్ స్వీటు తినిపించారు.

చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబు బాగా దూరదృష్టి కలిగిన నాయకుడని, బాగా కష్టపడతారని గవర్నర్ నరసింహన్ ప్రశంసించారు. అదే సమయంలో ఆయన ఒక్కరూ పని చేస్తే చాలదని, అందరూ కలిసి పని చేయాలని టిడిపి నేతలకు హితవు పలికారు. చంద్రబాబుపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు మంచి పాలనాదక్షుడని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అనుకొన్న పని సాధించే వరకూ పట్టు వీడరని, ఈసారి ఎన్నికలకు మంచి మ్యానిఫెస్టో తయారు చేసుకొని ప్రజల వద్దకు వెళ్లారని, గెలుపు సాధించి వచ్చారన్నారు.

చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబు, నరసింహన్

టిడిపి నేతలతో గవర్నర్ చనువుగా, చొరవగా, సరదాగా గడిపారు. చంద్రబాబు కోసం మిఠాయి తెప్పించారు. మీరు స్వీట్లు తినరని, డైటింగ్ చేస్తారని తనకు తెలుసునని, ఈ పూటకు డైటింగ్ పక్కన పెట్టాలని, రేపటి నుంచి చేయండి అంటూ.. ఓ మిఠాయి ఇచ్చారు. మిఠాయి వద్దు అనవద్దని అన్నారు. గవర్నర్ మాటలకు చంద్రబాబు కూడా నవ్వేసి స్వీటు తీసుకున్నారు.

చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబు, నరసింహన్

మనమందరం ఒక కుటుంబమని, తనను మీ కుటుంబ సభ్యుడిగా భావించాలని, తాను ఇక్కడ ఎంతకాలం ఉంటానో తెలియదని, ఉన్నంతవరకూ అందరం సమష్టిగా పని చేద్దామని, రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్నాయని, దాంతో పాటు కొన్ని సమస్యలు వస్తాయని, వాటిని సంయమనంతో పరిష్కరించుకొని ముందడుగు వేద్దామన్నారు.

 చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబు, నరసింహన్

చంద్రబాబుతో గవర్నర్ సుమారు పది నిమిషాలు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన పరిణామాల్లో ఇప్పటిదాకా జరిగిన పని, ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు, కొత్త రాష్ట్రానికి నిధుల లభ్యత తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది.

చంద్రబాబు

చంద్రబాబు

గవర్నర్‌తో భేటీ అనంతరం చంద్రబాబునాయుడు విలేకరులతో మాట్లాడారు. కొందరు నేతలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేయవద్దని హితవు పలికారు.

చంద్రబాబు

చంద్రబాబు

గవర్నర్‌తో భేటీ అనంతరం చంద్రబాబునాయుడు విలేకరులతో మాట్లాడారు. కొందరు నేతలు రెచ్చగొట్టి తెలంగాణ ప్రాంతానికి నష్టం చేయవద్దని హితవు పలికారు. అలా చేస్తే పెట్టుబడులు, ఉద్యోగాలు రావని సూచించారు.

English summary
TDP cheif Nara Chandrababu Naidu, who is set to become the first CM of the new post bifurcation residual state of AP, called upon governor Narasimhan at the Raj Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X