బీజేపీ గవర్నర్‌కు కేసీఆర్ సన్మానం, హ్యాపీగా..(పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి, మద్దతు కూడగట్టడంలో విద్యాసాగర రావు పాత్ర ఎనలేనిదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలక భూమిక పోషించారన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంత వ్యక్తికి తొలిసారి బయటి రాష్ట్రంలో అరుదైన గౌరవం విద్యాసాగర రావుకు లభించిందన్నారు. మహారాష్ట్ర గవర్నర్‌గా నియామకమై తొలిసారి ఆదివారం రాష్ట్రానికి వచ్చిన విద్యాసాగర రావుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవిహార్‌లో పౌర సన్మానం జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సహా పార్టీలకు అతీతంగా పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. సన్మాన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసినట్టే, కొత్త రాష్ట్రానికి విద్యాసాగర రావు అన్నివిధాలా తన సహాయ, సహకారాలు అందిస్తున్నారన్నారు.

 విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తెలంగాణలో నెలకొన్న విద్యుత్ కష్టాలను విద్యాసాగర రావు దృష్టికి తీసుకురాగా, ఆయన స్వయంగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి పియూష్ గోయల్‌తో మాట్లాడారని కేసీఆర్ గుర్తు చేశారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

ఇచ్చంపల్లివంటి బహుళార్ధసాదక ప్రాజెక్టు పూర్తి కావాలంటే చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాల సహకారం కావాలని కేసీఆర్ అన్నారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

ఈ ప్రాజెక్టు పూర్తికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర రావు కృషి చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు కూడా విద్యాసాగర రావు తనకెంతో ధైర్యాన్ని ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించారని గుర్తు చేసుకున్నారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విద్యాసాగర రావు తన వంతు సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

 విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

దేశ రాజకీయ చరిత్రలోనే విద్యాసాగర రావుకు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న విద్యాసాగర రావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు ఆమోదం పొందిందని కేసీఆర్ గుర్తు చేశారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుతో బంధుత్వంగానే కాకుండా, రాజకీయంగా మూడు దశాబ్దాల అనుబంధం ఉందని కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన సన్మానానికి విద్యాసాగర రావు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తెలంగాణ ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ, సహకారాలు అందించడానికి తనవంతుగా, ఆ రాష్ట్ర గవర్నర్‌గా కృషి చేస్తానని విద్యాసాగర రావు హామీ ఇచ్చారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తెలంగాణలో గ్రామగ్రామాన గోదావరి జలాలు పారాలని, సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలతో ఎల్లంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలన్నారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

కాళేశ్వరం నుంచి చత్తీస్‌గఢ్‌లోని సిరివంచ వరకు, ప్రాణహిత నుంచి మహారాష్ట్ర వరకు చిన్న చిన్న వంతెనలను నిర్మించుకుంటే నౌకాయానం సాధ్యమేనని, ఈ అంశంమై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సాధ్యమయ్యేలా చేస్తానని విద్యాసాగర రావు హామీ ఇచ్చారు.

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ... విద్యాసాగర రావు తనకు మంచి మిత్రుడని, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు తాను కేంద్ర హోంశాఖలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్టు గుర్తు చేశారు.

 విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

తర్వాత ఇదే రాష్ట్రానికి తాను గవర్నర్‌గా వచ్చిననప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకునిగా విద్యాసాగర రావుతో కొన్ని విషయాలలో తమకు వేరువేరుగా అభిప్రాయాలు ఉన్నప్పటికీ తమ మధ్య స్నేహం మాత్రం అలాగే ఉండిపోయిందని నరసింహన్అన్నారు.

 విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావుకు తెరాస సన్మానం

విద్యాసాగర రావు అభిప్రాయాలు క్షేత్రస్థాయిలో, వాస్తవిక దృక్పథానికి దగ్గరగా ఉంటాయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కొనియాడారు. కాగా, విద్యాసాగర రావును సన్మానిస్తున్న సమయంలో బండారు దత్తాత్రేయకు కేంద్రమంత్రివర్గంలో చోటు లభించిందని తెలియడంతో కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు లాభిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+