రాజధానిపై సింగపూర్ ప్రతినిధుల ఆశ్చర్యం: హెలికాప్టర్లో.. (పిక్చర్స్)
హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతంలో సింగపూర్ బృందం బుధవారం ఏరియల్ సర్వే జరిపింది.
ఉదయం 11.30 గంటలక సమయంలో ఈ బృందంతో వచ్చిన హెలికాప్టర్ గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలపై చక్కర్లు కొట్టింది.
భూభాగం స్పష్టంగా కనపడేంత ఎత్తుకు హెలికాప్టర్ దించి సింగపూర్ బృందం పరిశీలించింది. దీనిని ఆ ప్రాంత ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఏరియల్ సర్వే
రాజధాని ప్రాంత పరిధిని గగనతల పరిశీలనలో చూసి సింగపూర్ బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది మంత్రి నారాయణ రావు తెలిపారు. అక్కడి భవానీ ద్వీపం వారిని మరింత ఆకర్షించిందని, ఇప్పటి వరకు ఎందుకు అభివృద్ధి చేయలేదని అడిగారని నారాయణ చెప్పారు.

ఏరియల్ సర్వే
బుధవారం సింగపూర్ బృందంతో కలిసి రాజధాని ప్రాంతంలో నారాయణ ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు. ఆయన బుధవారం సచివాలయంలో మాట్లాడారు. ఎంపిక చేసిన ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేవయచ్చని సింగపూర్ ప్రతినిధులు చెప్పారన్నారు. రాజధాని విషయంలో చేసుకున్న ఒప్పందాలపై కొందరు అపోహలు తీసుకొస్తున్నారన్నారు.

ఏరియల్ సర్వే
ఈ ఒప్పందం చట్టబద్దమైందన్నారు. దీనికి కేంద్రం నుండి అవసరమైన అనుమతులు ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందన్నారు.

ఏరియల్ సర్వే
అత్యాధునిక ఆకాశ హర్మ్యాలతో, సకల హంగులతో నిర్మితం కానున్న నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ చిల్లిగవ్వ ఖర్చు లేకుండానే రూపొందుతుందోట. ఇందులో ఎన్ని ప్రత్యేకతలున్నప్పటికీ ఖర్చు మాత్రం నిల్లేనంటున్నారు మంత్రి నారాయణ.

ఏరియల్ సర్వే
చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన సందర్భంగా ఆయన వ్యవహార శైలికి ముచ్చటపడ్డ ఆ దేశ నిర్మాణ రంగ నిపుణులు ఉచితంగానే మాస్టర్ ప్లాన్ గీసిస్తామని హామీ ఇచ్చారట. అంతేకాదు, ప్రస్తుతం సదరు సింగపూర్ ప్రతినిధులు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. త్వరలోనే ఈ ఉచిత మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది.












Click it and Unblock the Notifications