వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఓకే: బీజేపీ ఎంపీ, కొత్తపల్లి గీత డిమాండ్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిన అవసరంపై జిల్లా ఎంపిలు గళమెత్తారు. విశాఖ నగరంలోని పౌర గ్రంధాలయంలో శనివారం జరిగిన అఖిలపక్ష సదస్సులో ఎంపీలు కంభంపాటి హరిబాబు, ఎం శ్రీనివాస రావు, కొత్తపల్లి గీత సహా పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొని రైల్వే సమస్యలపై ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేయడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రకు కొంతైనా న్యాయం చేసినట్టవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీఅధ్యక్షులు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడారు.

సెప్టెంబర్ 2న తూర్పుకోస్తా జోనల్ కేంద్రమైన భువనేశ్వర్‌లో జరిగే సమావేశంలో ఎంపీలుగా తమ వాదన వినిపిస్తామన్నారు. రాజధాని ఏర్పాటుపై విస్తృత చర్చ జరుగుతున్న తరుణంలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అంగీకారాన్ని వెల్లడించారన్నారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైతం విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.

విశాఖ రైల్వే జోన్

విశాఖ రైల్వే జోన్

గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం డివిజన్లను కలిపి విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా రైల్వే పరంగా ఎదురయ్యే పలు సమస్యలు సత్వరమే పరిష్కరించుకునేందుకు వీలవుతుందని కంభంపాటి హరిబాబు అభిప్రాయపడ్డారు.

 విశాఖ రైల్వే జోన్

విశాఖ రైల్వే జోన్

అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ వెనుకబడ్డ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసే బాధ్యత ఎంపిలుగా తమపై ఉందని అన్నారు. ఈప్రాంత ప్రజలకు మేలు చేకూరే విధంగా రైల్వే జోన్‌తో పాటు విద్య, ఉపాధి తదితర అంశాలపై దృష్టి సారిస్తామన్నారు.

 విశాఖ రైల్వే జోన్

విశాఖ రైల్వే జోన్

అరకు ఎంపి కొత్తపల్లి గీత మాట్లాడుతూ రైల్వే సమస్యల పరిష్కారానికి జోన్ సాధన ఒక్కటే మార్గమని అన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు ప్రాంతానికి అద్దాల రైలు నడిపే ప్రతిపాదన సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగుస్వామ్యంలో అద్దాల రైలును నడిపేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే అరకు ప్రాంతానికి పర్యాటకంగా చక్కటి గుర్తింపు లభిస్తుందని అన్నారు.

విశాఖ రైల్వే జోన్

విశాఖ రైల్వే జోన్

సిపిఐ నాయడుకు జెవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఆదాయ పరంగా వాల్తేరు డివిజన్ అగ్రభాగాన ఉన్నప్పటికీ సదుపాయాలు, సౌకర్యాల పరంగా వివక్షకు గురవుతోందని ఆరోపించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ ప్రతినిధి చలసాని గాంధీ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వే జోన్ సాధించుకోలేని పక్షంలో భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary
Photos of vishaka discussion on railway problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X