హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై జగన్, అఖిలకు కోపమొచ్చింది (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కేసులకు సంబంధించి తాము న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారని జగన్ మండిపడ్డారు. భూమా పైన రౌడీషీట్ పెట్టడం సరికాదన్నారు.

యాక్టివ్‌గా ఉన్న తమ నేతల పైన కేసులు పెడుతున్నారన్నారు. తమ పార్టీకి చెందిన కీలకమైన నలుగురు ఎమ్మెల్యేల పైన కేసులు పెట్టారన్నారు. పార్టీలోని కీలకమైన నగరి ఎమ్మెల్యే రోజా, పూతలపట్టి ఎమ్మెల్యే సునీల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి, ఇప్పుడు భూమా పైన కేసులు పెట్టారన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

భూమా నాగిరెడ్డి అరెస్టు వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ స్థాయికి దిగజారాడో అర్థమవుతోందని జగన్ అన్నారు. ప్రజా సమస్యల పైన పోరాడితే దొంగ కేసులా అని మండిపడ్డారు.

అఖిలప్రియ, మైసూరా

అఖిలప్రియ, మైసూరా

తమ కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా అఖిలప్రియ అన్నారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

న్యాయవ్యవస్థ మీద తమకు నమ్మకం ఉందని, తన తండ్రి క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సరైన విచారణ చేయకుండా కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా న్యాయపోరాటం చేస్తామని అఖిలప్రియ చెప్పారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

అనుక్షణం ప్రజల కోసమే పని చేస్తున్న తన తండ్రి భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి, రౌడీషీట్ ఓపెన్ చేశారని అఖిల ప్రియ ఆరోపించారు.

English summary

 Photos of YSR Congress Party chief YS jaganmohan Reddy, AKhila Priya speak to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X