Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pic Talk: ఇదిగో పట్టాభి: మాల్దీవులకు వెళ్లిన టీడీపీ నేత?: ఫ్లైట్ ఫొటో వైరల్

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఏమయ్యారు?, ఎక్కడ ఉన్నారు?, బెయిల్ లభించిన అనంతరం ఆయన ఎవరికీ కనిపించట్లేదు ఎందుకు?, అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మీడియా ముందుకు గానీ..జనం ముందుకు గానీ..చివరికి పార్టీ నాయకుల ముందుకు గానీ ఎందుకు రావట్లేదు?.. రెండు రోజులుగా ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. వాటన్నింటికీ ఒకేసారి సమాధానం దొరికినట్టే కనిపిస్తోంది. పట్టాభి దేశం విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది.

 ముఖ్యమంత్రిని దూషించిన కేసులో అరెస్ట్..

ముఖ్యమంత్రిని దూషించిన కేసులో అరెస్ట్..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన కేసులో పట్టాభి అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీనితో పోలీసులు ఆయనను మచిలీపట్నం కారాగారానికి తరలించారు. అక్కడ నుంచి ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్‌ భద్రత మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

బెయిల్ లభించడంతో..

బెయిల్ లభించడంతో..

ఏపీ హైకోర్టు ఆయనకు శనివారం బెయిల్ ఇచ్చింది. న్యాయమూర్తి కన్నెగంటి లలిత.. ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఆ తరువాత పట్టాభి అదృశ్యం అయ్యారు. బాహ్య ప్రపంచం ముందుకు రాలేదు. పార్టీ నాయకులను కూడా కలుసుకోలేదు. జైలు నుంచి విడుదల అయ్యేటప్పుడు పట్టాభి చివరిసారిగా కనిపించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత కారులో కూర్చుని, తన అనుచరులు, పార్టీ అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు పట్టాభి. ఆ తరువాత ఆయన మాయం అయ్యారు.

పార్టీ నేతలకు కూడా దూరం..

ఈ క్రమంలో పట్టాభి ఇంటికి వెళ్లలేదని తెలుస్తోంది. హనుమాన్ జంక్షన్‌లో ఓ స్నేహితుడి ఇంట్లో ఉన్నారంటూ తొలుత వార్తలు వచ్చాయి. అవేవి విశ్వసించదగ్గ సమాచారం కాదంటూ టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆ తరువాత ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి కూడా రాలేదు. పార్టీ నాయకులు ఎవరినీ కలుసుకోలేదు. వారితో దూరంగా ఉంటూ వచ్చారు. ఒకరకంగా పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లినట్టయింది పట్టాభి.

రాజకీయాల్లో పెనుదుమారం..

రాజకీయాల్లో పెనుదుమారం..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి పట్టాభి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి బోసిడికే అంటూ ఆయన చేసిన కామెంట్స్ పట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆందోళనలకు దిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపైనా దాడులకు దిగారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా 36 గంటల పాటు దీక్ష చేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లారు. కొద్దిసేపటి కిందటే పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు.

 మాల్దీవులకు విశ్రాంతి కోసం..

మాల్దీవులకు విశ్రాంతి కోసం..

ఈ పరిణామాల మధ్య పట్టాభి ఓ విమానంలో కనిపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన రెండు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రత్యేకించి- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని గ్రూపుల్లో ఈ ఫొటోలు హల్‌చల్ చేస్తోన్నాయి. గోధుమరంగు షర్ట్ ధరించిన వ్యక్తి పట్టాభేనంటూ అభిప్రాయపడుతున్నారు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు. బెయిల్ లభించిన తరువాత ఆయన మాల్దీవులకు బయలుదేరి వెళ్లారని అంటున్నారు.

Recommended Video

    TTDP Mouna Deeksha: చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా TTDP నేతల మౌన దీక్ష
     హైదరాబాద్ నుంచి గో ఫస్ట్ ఫ్లయిట్‌లో..

    హైదరాబాద్ నుంచి గో ఫస్ట్ ఫ్లయిట్‌లో..

    బెయిల్ లభించిన అనంతరం పట్టాభి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారని, అక్కడి నుంచి నేరుగా మాల్దీవులకు వెళ్లారనేది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫొటోల సారాంశం. విశ్రాంతి కోసం ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు చెబుతున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ నంబర్ జీ8 1533 విమానంలో హైదరాబాద్ నుంచి మాలీకు వెళ్లారని అంటున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి తరువాత ఆయన మళ్లీ రాష్ట్రానికి చేరుకుంటారని అంచనా వేస్తోన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+