విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊరట: అదుపులోకి వచ్చిన కార్చిచ్చు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం నగరానికి సమీపంలోని గుడిలోవ కొండలపై కార్చిచ్చును శుక్రవారం సాయంత్రానికి అదుపు చేయగలిగారు. 17 వేల హెక్టార్లలో విస్తరించి వున్న గుడిలోవ కొండపై తుఫాన్‌ వల్ల కూలిపోయిన వేలాదిచెట్లు ఎండిపోయాయి.

కాగా కొండపై ఉన్న రంగనాథ ఆలయం, నారాయణేశ్వరస్వామి ఆల యాల్లో గురువారం మహిళలు వెలిగించిన కార్తీక దీపాలు ఎండుటాకులకు అంటుకుని మం టలు వ్యాపించాయి. మంటలను ఆర్పటానికి చేసిన యత్నాలు విఫలం కావడంతో సీఎంకు మంత్రులు తెలియజేయడంతో నాలుగు నేవీ హెలికాప్టర్‌లను పంపించారు. ఆ తర్వాత అవి గగనతలం నుంచి నీటిని వెదజల్లడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.

మంటలను అదుపు చేసేందుకు నేవీకి చెందిన ఐదు అగ్నిమాపక యంత్రాలతోపాటు, అగ్నిమాపకశాఖకు చెందిన 12 యంత్రాలను రంగంలోకి దించారు. అగ్నిమాపక శకటాలు కొండలపైకి చేరే పరిస్థితి లేదు. నేవీ హెలికాప్టర్లద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా, చీకటి పడడంతో సాధ్యం కాలేదు. ఈ కొండ 17 వేల ఎకరాల్లో విస్తరించి ఉందని డిఎఫ్‌ఓ రామ్మోహనరావు తెలిపారు.

నేవీ హెలికాప్టర్లు ఇలా..

నేవీ హెలికాప్టర్లు ఇలా..

విశాఖపట్నం సమీపంలోని గుడిలోవ కొండలపై చెలరేగిన మంటలను అదుపు చేయడానికి నేవీ హెలికాప్టర్లను వాడారు.

గంటా శ్రీనివాస రావు ఇలా..

గంటా శ్రీనివాస రావు ఇలా..

గుడిలోవ కొండలపై కార్చిచ్చు రేగిన నేపథ్యంలో వాటిని అదుపు చేయడానికి చేపట్టిన చర్యలను పరిశీలిస్తున్న మంత్రి గంటా శ్రీనివాస రావు

హరిబాబు పరామర్శ

హరిబాబు పరామర్శ

కార్చిచ్చు బాధితులను బిజెపి పార్లమెంటు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు హరిబాబు ఇలా పరామర్శించారు.

నేవీ హెలికాప్టర్లు ఇలా

నేవీ హెలికాప్టర్లు ఇలా

గుడిలోవాలో చెలరేగిన మంటలను ఆర్పడానికి నేవీ హెలికాప్టర్లు ఇలా పనిచేశాయి. మంటలు అదుపులోకి వచ్చాయి.

English summary

 A massive forest fire started raging on at the Gudilova hills on Thursday evening which is proving tough for the fire fighters to bring under control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X