కన్న కొడుకు హత్య: తల్లిదండ్రులు కడుపుకోత (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆరేళ్ల బాలుడు యశ్ రాజ్‌కుమార్ హత్యోదంతం గుండెలను కలచివేసింది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్న ఆ బాలుడిని మేనమామే అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కన్నకొడుకు హత్యతో తల్లిదండ్రుల వేదన చెప్పనలవి కాకుండా ఉంది. మేనమామ వినోద్ కొనిచ్చిన చిప్స్ తింటూ అతనితో పాటు ఆటోలో పీరంచెరువు దాకా వెళ్లాడు. తాను కసాయి వెంట వెళ్తున్నాననే విషయం ఆ బాలుడికి తెలియదు.

మేనమామ వినోద్ ఆ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇరవై వేల రూపాయల కోసం సొంత మేనమామ వినోద్ కిడ్నాప్ చేసి, యశ్ రాజ్‌కుమార్‌ను హత్య చేశాడని హైదరాబాద్ పశ్చిమ మండలం డిసిపి సత్యనారాయణ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

డిసిపి సత్యనారాయణ కథనం ప్రకారం - వినోద్‌కు అనూప్ సహకరించి ఉండవచ్చు. హత్యలో అనూప్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగ్‌లోని పిరంచెరువు సమీపంలో యశ్ రాజ్‌కుమార్‌ను దారుణంగా హత్య చేశారు. వినోద్‌ను, అనూప్‌ను మంగళహాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడి గొంతుకు ఉరి బిగించి హత్య చేసి, ఆ తర్వాత బండరాయితో ముఖంపై మోదారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి శవాన్ని తగులబెట్టారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మంగళహాట్ గోడెఖబర్‌కు చెందిన అనిల్ కుమారుడు యశ్‌రాజ్ కుమార్. మంగళవారం అదృశ్యం కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు.

వినోద్ బాలుడ్ని కిడ్నాప్ చేసి మద్యం మత్తులో హత్య చేశాడని పోలీసులు గుర్తించారు. ఆటోలు మారుస్తూ, బాలుడికి చిప్స్ ప్యాకెట్ ఇప్పించి, మధ్యలో మద్యం సేవించి వినోద్ పిరంచెరువు వద్దకు చేర్చాడు. యశ్ రాజ్ కుమార్ తల్లిదండ్రులకు ఎవరితోనూ విరోధం లేదని పోలీసులు తెలిపారు.

ఆరేళ్ల బాలుడి హత్య 1

ఆరేళ్ల బాలుడి హత్య 1

ఆటపాటలతో అల్లరి చేస్తూ ముద్దులు ఒలికే కన్న కొడుకు హత్యకు గురైతే ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎలా వర్ణించగలం...

ఆరేళ్ల బాలుడి హత్య 2

ఆరేళ్ల బాలుడి హత్య 2

ఇంటిలో ఆడుతూ పాడుతూ అల్లరి చేసే కన్న కుమారుడు హత్యకు గురైతే ఆ తల్లిదండ్రులు ఎలా రోదిస్తారో చెప్పగలమా..

ఆరేళ్ల బాలుడి హత్య 3

ఆరేళ్ల బాలుడి హత్య 3

తల్లిదండ్రులతో పాటు యశ్ రాజ్ కుమార్ నివసించే ఇల్లు ఇదే.. బాలుడి హత్యతో అతని నివాసం వద్ద విషాద వాతావరణం చోటు చేసుకుంది.

ఆరేళ్ల బాలుడి హత్య 4

ఆరేళ్ల బాలుడి హత్య 4

మద్యం మత్తులో యశ్ రాజ్ కుమార్‌ను తానే చంపానని అతని మేనమామ వినోద్ అంటున్నాడు. 20 వేల రూపాయల కోసం బాలుడ్ని కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నాడు.

ఆరేళ్ల బాలుడి హత్య 5

ఆరేళ్ల బాలుడి హత్య 5

బాలుడిని చంపడానికి మేనమామకు చేతులు ఎలా వచ్చాయో తెలియదు. హత్య చేసిన తర్వాత తలపై బండరాయితో మోదాడు.

ఆరేళ్ల బాలుడి హత్య 6

ఆరేళ్ల బాలుడి హత్య 6

అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న మంగళహాట్ పోలీసులు పీరం చెరువు వద్ద శవం పడి ఉండడం చూసి గుర్తింపు కార్డు ద్వారా యశ్ రాజ్ కుమార్ హత్య గురైనట్లు గుర్తించారు.

ఆరేళ్ల బాలుడి హత్య 7

ఆరేళ్ల బాలుడి హత్య 7

కుమారుడి హత్యతో తల్లి కంటికీ మింటికీ ఏకధారగా ఏడ్చింది. ఆమె కడుపు కోతను తీర్చేవారే లేనట్లుగా ఉంది పరిస్థితి

ఆరేళ్ల బాలుడి హత్య 8

ఆరేళ్ల బాలుడి హత్య 8

తనను కడతేరుస్తాడని తెలియని అమాయకుడు యశ్ రాజ్ కుమార్ తన మేనమామతో చిప్ప్ తింటూ వెళ్లాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+