వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్థసారథి భార్య డబ్బులతో చిక్కిన వైనం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమల నుంచి రూ.45.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సులో కమల ప్రయాణిస్తుండగా, వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి ఆమె వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆమె కూకట్‌పల్లిలో ఆర్టీసీ బస్సు ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

కమల వద్ద నగదుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవటంతో ఐటీ అధికారులకు ఇన్‌స్పెక్టర్ గోపాల కృష్ణ మూర్తి సమాచారం అందించారు.హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శుక్రవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మాజీ మంత్రి పార్థసారథి భార్య కమల రూ.45.10 లక్షలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

సిబ్బంది జీతాల చెల్లింపునకు డబ్బు తీసుకెళ్తున్నట్లు కమల పోలీసులకు చెప్పినప్పటికీ అందుకుతగ్గ ఆధారాలు లేకపోవడంతో ఆ మొత్తాన్ని ఐటీ శాఖకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పార్థసారథి వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థిగా మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

పార్థసారథి సతీమణి కమల

పార్థసారథి సతీమణి కమల

డబ్బుతో పట్టుబడిన పార్థసారథి భార్య కమల ఇలా పోలీసుల ముందుకు కూర్చుని కనిపించారు.

డబ్బులు ఇవే..

డబ్బులు ఇవే..

పార్థసారథి సతీమణి కమల వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ. 45లక్షల రూపాయల నగదు సొమ్ము ఇదే..

సరైన సమాచారం ఇవ్వలేకపోయారు..

సరైన సమాచారం ఇవ్వలేకపోయారు..

డబ్బులకు సంబంధించి పార్థసారథి భార్య కమల సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. సిబ్బంది జీతాలకని చెప్పినప్పటికీ ఆధారాలు చూపించలేకపోయారు.

వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు

వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు

పార్థసారథి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు.

బస్సులో పట్టుబడ్డారు..

బస్సులో పట్టుబడ్డారు..

లక్షల రూపాయల నగదుతో ఆర్టీసి బస్సులో వెళ్తున్న పార్థసారథి భార్యను పోలీసులు హైదరాబాదులోని వనస్థలిపురం వద్ద పట్టుకున్నారు.

English summary
Police have seized Rs 45 lakhs from YSR Congress Machilipatnam Lok Sabha candidate Parthasarathy's wife Kamala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X