సదర్ అదుర్స్: అపశ్రుతి, ఒకరి మృతి (పిక్చర్స్)

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సదర్ ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో దున్నపోతులను అలంకరించి, యాదవ సోదరులు సదర్ ఊరేగింపు నిర్వహించారు.

మొత్తం మీద హైదరాబాద్‌లో సదర్ సంబరాలు కనుల పండువగా ప్రారంభమయ్యాయి. పలుప్రాంతాల నుంచి ముస్తాబై వచ్చిన దున్నపోతులతో వా టి యజమానుల విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ ప్రారంభించి, చిందులేస్తూ ఉత్సాహపరిచారు.

ఏటా దీపావళి మరునాడు ఖైరతాబాద్ నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాల నిర్వహణ సంప్రదాయంగా వస్తోంది. కాగా నగరంలో జరిగిన సదర్ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఓ యువకుడు మరణించాడు.

దున్నపోతు విన్యాసాలు..

దున్నపోతు విన్యాసాలు..

సదర్ వేడుకల సందర్భంగా యావద సోదరులు దున్నపోతులను అలంకరించి, వాటితో విన్యాసాలు చేయిస్తారు. ఈ దృశ్యం చూస్తే తెలుస్తుంది.

సాహసం ఇలా..

సాహసం ఇలా..

దున్నపోతుతో విన్యాసాలు చేయిస్తూ ఓ యాదవ సోదరుడు ఇలా కనిపించాడు.. హైదరాబాదులో యేటా సదర్ ఉత్సవాలు జరుగుతాయి.

దున్నపోతు స్వారీ చేస్తూ...

దున్నపోతు స్వారీ చేస్తూ...

తాము కృష్ణుడి వారసులమని యాదవులు భావిస్తారు. ఓ యువకుడు సదర్ వేడుకల్లో భాగంగా దున్నపోతుపైకి ఎక్కి ఇలా విన్యాసాలు చేస్తున్నాడు.

చిందులేస్తూ ఇలా...

చిందులేస్తూ ఇలా...

సదర్ వేడుకల్లో భాగంగా యాదవ సోదరులు నృత్యాలు చేస్తారు. తమలోని కళా నైపుణ్యాన్ని వెలికి తీసి ప్రదర్శిస్తారు.

అంజన్ కుమార్ యాదవ్ నృత్యాలు..

అంజన్ కుమార్ యాదవ్ నృత్యాలు..

సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ సదర్ వేడుకల్లో పాల్గొన్నారు. చిందులు వేస్తూ ఆయన ఊత్సాహపరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+