వచన్ మృతి: గుండెలు పిండేసే తల్లి రోదన (పిక్చర్స్)
హైదరాబాద్: ప్లే స్కూల్లో చేరిన వచన్ అనే రెండున్నరేళ్ల బాలుడు సంపులో పడి మరణించిన సంఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిలించింది. వచన్ తల్లి రోదన గుండెలను పిండేసే విధంగా ఉంది. మంగళవారం ప్లే స్కూల్లో చేరి, బుధవారం సంపులో పడి ఓ రెండున్నరేళ్ల బాలుడు మరణించిన హృదయ విదారక సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
రెండున్నరేళ్ల బాలుడు వచన్ తల్లిదండ్రులు వనస్థలిపురంలోని అభిజ్ఞాన్ కిడ్స్ కేర్ స్కూల్లో చేర్చారు. అతను బుధవారం పాఠశాల సంపులో పడి మరణించాడు. బాలుడు సంపులో పడిన విషయాన్ని అక్కడి ఆయా గానీ ఇతరులు గానీ గుర్తించలేదు. వారు గుర్తించేసరికి అతను మరణించాడు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. పాఠశాల యజమానులు పాఠశాలకు తాళాలు వేసి చల్లగా జారుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వచన్ తల్లి ఇలా..
సంపులో పడి మరణించిన వచన్ తల్లి రోదన హృదయవిదారకంగా గుండెలను పిండేసే విధంగా ఉంది.

ఈ శోకం ఆరేది కాదు..
వచన్ తల్లి పట్టరాని శోకంతో తల్లడిల్లిపోయింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు ఆరోపించారు.

అప్పటికే వచన్ మృతి
సంపులో పడిన బాలుడు వచన్‌ను తీసి ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అయితే, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపించారు.

ఎంత చక్కటి...
ఎంత చక్కటి పిల్లాడో అన్నట్లు తల్లిదండ్రుల ఒడిలో వచన్ కూర్చుని ముద్దులు ఒలకబోస్తున్నాడు. ఆ ముద్దుమురిపాలు ఇక లేవు.

పాఠశాల ఇదే...
రెండున్నరేళ్ల వచన్‌ను చేర్పించిన అభిజ్ఝాన్ కిడ్స్ ప్లే స్కూల్ ఇదే. ఇందులోని సంపులో పడి వచన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.

వచన్‌ను మింగిన సంపు ఇదే..
రెండున్నరేళ్ల అభం శుభం తెలియని వచన్‌ను మింగేసిన ప్లే స్కూల్లోని సంపు ఇదే. అతను ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు.

ఈ నవ్వులు ఇక లేవు..
ప్లే స్కూల్లో చదువులు ఉండవని, ఆటాపాటలే ఉంటాయని వచన్‌ను తల్లిదండ్రులు అక్కడ చేర్చారు. కానీ ఈ బోసి నవ్వులు ఇక లేవని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.












Click it and Unblock the Notifications