భూమనపై ఫైట్: వెంకటరమణకు ప్రతీకారం (పిక్చర్స్)
తిరుపతి: తిరుపతిలో పోలింగ్ సందర్భంగా వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణ ఇంటిలో పోలీసులు ఓ రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఇందుకు ఆయన కుటుంబ సభ్యులు కంట తడి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే, అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి వెంకటరమణతో తగాదాకు దిగారు.
తనపై చేయి చేసుకున్నారని వెంకటరమణ ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి తనపై దాడి చేసినందుకు నిరసనగా ఆయన మౌనదీక్ష చేపట్టారు. ఇదంతా పోలింగ్ ముగిసిన తర్వాత జరిగింది. చివరకు భూమన కరుణాకర్ రెడ్డిని ఓడించి తన ప్రతీకారం తీర్చుకున్నారు.
కష్టించినందుకు వెంకటరమణకు ఫలితం దక్కింది. ఆయన తిరుపతి నియోజకవర్గంలో విజయం సాధించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయనపైనే దయ చూపారు.

భూమన నిర్వేదం
తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు భూమన విజయం సాధించారు

వెంకటరమణ విజయం
తిరుపతి శాసనసభా స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి వెంకటరమణ విజయం సాధించారు.

ఎగిరిన తెలుగుదేశం జెండా
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. తిరుపతి శాసనసభ స్థానంలో వెంకటరమణ విజయం సాధించారు.

ఎన్టీఆర్‌కు నివాళులు
తిరుపతిలో విజయం సాధించిన తర్వాత వెంకటరమణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications