Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎయిర్ ఇండియాఫ్లైట్ క్రాష్ రిపోర్ట్ కలకలం..! పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరాలు..!

గత నెలలో అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ కుప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరిపిన విచారణ సంస్థ ఇవాళ వెల్లడించిన నివేదిక తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నివేదికలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలడానికి పైలట్లు ఇంధనం స్విచ్ విషయంలో చేసిన పొరబాటే కారణమనేలా అభిప్రాయం వ్యక్తం కావడంతో కేంద్రంతో పాటు పైలట్ల సంఘం కూడా ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ నివేదికపై స్పందించిన పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అప్పుడే ఓ నిర్ధారణకు రావొద్దని కోరగా.. పైలట్ల సంఖ్య అయితే తీవ్రంగా మండిపడింది.

జూన్ 12న జరిగిన ఈ విమాన ప్రమాదంపై ఇవాళ వెలువడిన నివేదిక తర్వాత మొత్తం దర్యాప్తు జరుగుతున్న తీరుపై భారత పైలట్ల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నివేదిక పైలట్ల నేరాన్ని ఊహించినట్లుగా ఉందని మండిపడింది. పైలట్లు ఇంధన స్విచ్ విషయంలో పొరబాటు చేయడం వల్లే విమానం కుప్పకూలిందంటూ నివేదికలో చెప్పడాన్ని పైలట్ల సంఘం తీవ్రంగా తప్పుబట్టింది. ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ (అల్పా) ఇండియా అధ్యక్షుడు కెప్టెన్ సామ్ థామస్ ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన చేశారు.

pilots body slams air india plane crash inquiry report says presumed guilt violated secrecy

ఇందులో పైలట్ల నేరాన్ని ఊహించే దిశలో దర్యాప్తు జరుగుతోందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ఆలోచనా విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ దర్యాప్తుల చుట్టూ ఉన్న రహస్యంపై పైలట్ల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అలాగే ఈ దర్యాప్తులో పాల్గొన్న వారి అర్హతలను కూడా ప్రశ్నించింది. ఈ కీలకమైన దర్యాప్తులకు తగిన అర్హత కలిగిన సిబ్బందిని బోర్డులోకి తీసుకోలేదనే వాస్తవం గుర్తించినట్లు తెలిపింది. ఇంధన నియంత్రణ స్విచ్‌లు అనుకోకుండా కదలినట్లు గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఇచ్చిన నివేదికను పైలట్ల సంఘం గుర్తుచేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వారికి ఈ నివేదిక ఎలా అందిందని ప్రశ్నించింది.

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపిన ప్రధాన పైలట్ బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787ను 56 ఏళ్ల సుమీత్ సభర్వాల్ నడిపారు. ఆయనకు మొత్తం 15,638 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. అలాగే కో-పైలట్ క్లైవ్ కుందర్ కు 3,403 గంటలు విమానాలు నడిపిన అనుభవం ఉంది. దీంతో వీరు తప్పు చేసే అవకాశం లేదని పైలట్ల సంఘం చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+