పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఘనవిజయం.. వంగా గీత ఓటమి.. ఓటర్లకు అభివాదం చేసిన అన్నాలెజ్నేవా
Pithapuram assembly election Results: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన పిఠాపురం ఎన్నికల ఫలితాలు రానే వచ్చాయి. పిఠాపురం నియోజకవర్గం వర్గంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ ఘన విజయం.. అభివాదం చేసిన అన్న లెజ్నేవా
పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వంగా గీత పై 70354 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పిఠాపురంలో జనసైనికుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇంటివద్ద ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా అభిమానులకు, ప్రజలకు అభివాదం చేసి పవన్ కళ్యాణ్ విజయానికి పిఠాపురం నియోజకవర్గంలో విజయానికి కారణమైన వారికి తన కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా పవన్
ఆమెతోపాటు అక్కడ పవన్ తనయుడు అఖీరా నందన్ కూడా అక్కడ ఉన్నారు. అయితే ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేవారు ఇంకెవరైనా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా ప్రస్తుతం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఈసారి బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని భావించిన వేళ పవన్ కళ్యాణ్ విజయం సాధించారు.
లక్షకు పైగా మెజార్టీపై బెట్టింగులు
అయితే లక్షకు పైగా మెజారిటీతో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారని ఏపీలో బెట్టింగులు కట్టిన వేళ లక్షకుపైగా మెజారిటీ సాధిస్తారని ధీమా వ్యక్తం చేసి, బెట్టింగులు కట్టిన బెట్టింగ్ రాయుళ్లకు మాత్రం నిరాశ ఎదురైంది అని చెప్పాలి. ఏది ఏమైనా పదేళ్ల క్రితం పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీని ఎన్నో ఒడిదుడుకుల మధ్య కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా ముందుకు నడిపించారు.
ఎమ్మెల్యేగానే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం ను చేసిన ఓటర్లు
పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసే రెండు చోట్ల ఓటమి పాలు చేసిన ఏపీ ప్రజల కోసం మళ్లీ నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు. ఇక ఈ క్రమంలో ఈసారి తెలుగు పవన్ కళ్యాణ్ కు తమ ఓటుతో పోటెత్తారు. తమ అభిమానాన్ని ఈసారి ఓటు రూపంలో చూపించి ఆయనను ఎమ్మెల్యేగానే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం ను చేశారు.












Click it and Unblock the Notifications