Pawan kalyan: పవన్ వారాహి సభ తర్వాత పిఠాపురంలో జరుగుతుందిదే!!
ఏపీలో గత ఎన్నికలకు ముందు వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ రాసుకుని తిరగడం పెద్ద ఎత్తున ప్రచారమైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ కోసం మొదలైన ఈ ట్రెండ్ ఏపీలో చాలా జిల్లాలకు పాకింది.
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా నెంబర్ ప్లేట్ లపై పవన్ చెప్పిందిదే
ఇక ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ వాహనాల నెంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకున్న అంశం పైన ఫన్నీ కామెంట్స్ చేశారు. పోలీసులు వాహన తనిఖీలలో ఆపితే మీతో పాటు నన్ను కూడా తిట్టుకుంటారు అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ దయచేసి అందరూ రూల్స్ పాటించాలని ఒరిజినల్ నెంబర్ ప్లేట్లను పెట్టుకోవాలని సూచించారు.

ఆ నెంబర్ ప్లేట్లను తీసేస్తున్న పోలీసులు
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతో కొందరు నెంబర్ ప్లేట్లను మారుస్తుంటే మరికొందరితో పోలీసులు నంబర్ ప్లేట్లను మార్పిస్తున్నారు. ఇన్ని రోజులు వాహనాల నంబర్ ప్లేట్లను చూసి చూడనట్టు వదిలిపెట్టిన పోలీసులు ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురం వారాహి సభ తర్వాత యాక్షన్ లోకి దిగారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ పెట్టిన నెంబర్ ప్లేట్లను పీకి పారేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైసీపీ సెటైర్లు
ఇక దీనిపై వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జనసేనను టార్గెట్ చేస్తున్నారు. "మనల్ని ఎవడు ఆపేది అంటున్న పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... మేమే ఆపేది అంటున్న పోలీసులు" అంటూ సెటైర్లు వేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనగానే బండి పక్కనపెట్టి నెంబర్ ప్లేట్లు పారేసారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
గట్టిగా సమాధానం ఇస్తున్న జనసేన
అయితే దీనికి జనసేన నాయకులు కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. తాము చట్టాన్ని పాటిస్తామని అందుకే పోలీసులు చెప్పిన వెంటనే నెంబర్ ప్లేట్లు మారుస్తున్నామని చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు నేరుగా జగన్ ఫోటోలు ఆటోలకు అతికించిన ఘటనలు మరిచిపోయారా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇక వారు ఆ వీడియోలతో వైసీపీకి షాక్ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications