వర్మను జీరో చేసేశాం-నారాయణ కామెంట్స్ రచ్చ-స్పందించిన పిఠాపురం నేత..!

ఏపీ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ తనపై చేసిన విమర్శలపై పిఠాపురం టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. తాజాగా నెల్లూరు సిటీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో లీక్ కావడంతో వివాదం మొదలైంది. ఈ ఆడియోలో మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా జీరో చేసినట్లు మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటిపై వర్మ స్పందించారు.

కేవలం పవన్ కళ్యాణ్‌ కోసమే వర్మను జీరో చేశామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు, వర్మకు రోజూ ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉందని ఆయన వెల్లడించారు. తనను జీరో చేశారని వర్మ గత నాలుగు నెలలుగా చెప్పుకుంటున్నారని నారాయణ తెలిపారు. పిఠాపురంలో వర్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండాలని చంద్రబాబు స్వయంగా వార్నింగ్ ఇచ్చారని గుర్తుచేశారు.

pithapuram tdp leader svsn varma reacts to minister Narayana remark keep calm for alliance

అంతేకాకుండా జనసేన వాళ్లు పిలిస్తేనే వర్మ వెళ్లి మాట్లాడాలని, లేకుంటే సైలెంట్ గా ఉండాలని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై ఏమీ మాట్లాడొద్దని, ఎవరైనా గీత దాటితే వ్యవహారం వేరేలా ఉంటుందని మంత్రి నారాయణ హెచ్చరికలు చేశారు. దీనిపై వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ సొంతంగా గెలవలేదని, బలమైన ఓటు బలం ఉన్న వర్మ త్యాగం వల్ల పిఠాపురంలో గెలవగలిగారన్నారు. పవన్ గెలుపుకు పూర్తి క్రెడిట్ వర్మకు ఇవ్వాలని, వర్మ సహకారం లేకపోతే పవన్ గెలవడం కష్టమయ్యేదన్నారు.

pithapuram tdp leader svsn varma reacts to minister Narayana remark keep calm for alliance

ఈ నేపథ్యంలో వర్మ ఇవాళ స్పందించారు. మంత్రి నారాయణ కామెంట్స్ పై స్పందిస్తూ.. టీడీపీకి తానెప్పుడూ ఫైర్ బ్రాండ్ నే అన్నారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటన్నారు. వర్మ అంటే ఏమిటో పిఠాపురం ప్రజానీకానికి తెలుసన్నారు. టీడీపీలో తనది 23 సంవత్సరాల ప్రయాణమని, కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటానన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. తనకు చంద్రబాబుపై, లోకేష్ పై ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి తెలుసన్నారు. ఎవరో ఏదో అన్నారని తాను లక్ష్మణ రేఖ దాటనన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+