జనసేన అవమానాలకు వర్మ ఘాటు కౌంటర్- షాకింగ్ ట్వీట్..!

ఏపీ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా వార్తల్లో నిలుస్తున్న నియోజకవర్గం పిఠాపురం. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో ఇక్కడ కూటమి అభ్యర్ధిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. ఇందులో స్థానిక టీడీపీ నేత, పిఠాపురం టికెట్ ఆశించిన ఎస్వీఎస్ఎన్ వర్మ త్యాగం కూడా ఉంది. అయితే ఎన్నికల్లో గెలుపు తర్వాత వర్మను అభినందించిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మాత్రం వదిలేశారు. ఆయనకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీ అయితే పూర్తిగా గాలికి కొట్టుకుపోయింది.

ఈ నేపథ్యంలో వర్మ జనసేనతో పాటు తన సొంత పార్టీ టీడీపీ పట్ల అసంతృప్తిగా కనిపిస్తున్నారు. పిఠాపురంలో తనను దూరం పెడుతున్న జనసేన నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి దాచుకోలేక ఒకటి రెండు సార్లు ఆయన సోషల్ మీడియాలో బయపడిన పరిస్ధితులు కూడా ఉన్నాయి. దీంతో పరిస్దితి గమనించిన జనసేన పార్టీ నేతలు.. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంతో తమకు సంబంధం లేదని తేల్చేశారు.

pithapuram tdp leader svsn varma tweet counter to janasena leaders remark

ఆ తర్వాత పిఠాపురంలో జనసేన సభలో అయితే వర్మను పూర్తిగా టార్గెట్ చేశారు. పవన్ విజయంలో పిఠాపురం ప్రజలు మాత్రమే ఉన్నారని, ఇంకెవరైనా ఉన్నారనుకుంటే కర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించకుండా మౌనంగా ఉన్న టీడీపీ నేత వర్మ .. ఇవాళ ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ప్రజలే నా బలం అంటూ ఓ భారీ స్లోగన్ పెట్టారు. అలాగే పైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర కూటమి నేతల ఫొటోలు కూడా పెట్టారు. అయితే ఈ ట్వీట్ ద్వారా వర్మ జనసేనకు గట్టి కౌంటర్ ఇచ్చారనే చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+