రూటు మార్చిన వర్మ, అనూహ్య డిమాండ్ - చంద్రబాబు వాట్ నెక్స్ట్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పిఠాపురం కేంద్రంగా సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఎమ్మెల్సీగా నాగబాబు నియోజక వర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ నేత వర్మకు ఆహ్వానం లేదు. పలు సందర్భాల్లో టీడీపీ - జనసేన కేడర్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పిఠాపురం పరిణామాల పైన రెండు పార్టీల అధినాయకత్వం స్పందించటం లేదు. ఈ సమయంలోనే వర్మ స్పందించారు. కీలక డిమాండ్ పార్టీ ముందు ఉంచారు. దీంతో, పిఠాపురం రాజకీయం ఆసక్తిని పెంచుతోంది.

మారుతున్న లెక్కలు
పిఠాపురంలో కొంత కాలంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి సైతం ఇప్పటి వరకు దక్కలేదు. నాగబాబు జనసేన సభలో వర్మను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రెండు పార్టీల మధ్య గ్యాప్ ను పెంచాయి. నాగబాబు పర్యటన వేళ వర్మ మద్దతు దారులు నిరసనలకు దిగారు. వర్మను ఆహ్వానించకుండా నాగబాబు కార్యక్రమాల్లో పాల్గొనటం పైన ఆందోళన వ్యక్తం చేసారు. నాగబాబు చేసిన వ్యాఖ్యల తరువాత పిఠాపురంలో రెండు పార్టీల కేడర్ మధ్య అంతర్గతంగా రచ్చ సాగుతున్నా.. రెండు పార్టీల నాయకత్వం ఎక్కడా స్పందించటం లేదు.

pithapuram-varma-latest-demand-for-tdp-leadership-details-here

ఇక నో ఛాన్స్
ఈ సమయంలో అసలు వర్మ రాజకీయ భవిష్యత్ పైన పలు రకాల చర్చలు సాగుతున్నాయి. వర్మ మాత్రం టీడీపీ నాయకత్వం పైన విధేయత చూపిస్తున్నారు. తొలి విడతలోనే ఎమ్మెల్సీ పదవి పైన హామీ దక్కినా అమలు కాలేదు. అసలు వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. పిఠాపురం నుంచి వర్మను ఎమ్మెల్సీ చేస్తే మరో పవర్ సెంటర్ అవుతుందనే చర్చ కూటమి నేతల్లో వినిపిస్తోంది. దీంతో, వర్మకు నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, ఇప్పుడు తాజాగా వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ పేరు ప్రస్తావన చేయకుండానే కూటమి అధి కారంలోకి రావటానికి కారణం ఎవరో తన మనసులో మాట బయట పెట్టారు.

Take a Poll

వర్మ తాజా కామెంట్స్
వర్మ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. టిడిపికి లోకేష్ నాయకత్వం అవసరం అని చెప్పుకొచ్చారు. టీడీపీకి 2047 ప్రణాళిక కావాలని వ్యాఖ్యానించారు. పార్టీ రధ సారధి గా లోకేష్ ను నియమించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు. యువ గళం పాదయాత్ర వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి రావటానికి లోకేష్ కారణమని చెప్పటం ద్వారా జనసేన ప్రచారానికి చెక్ పెట్టేలా వర్మ వ్యూహాత్మకంగానే ఈ కామెంట్స్ చేసారనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో పార్టీలో తన ఫ్యూచర్ కోసం కొత్త ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. కూటమి కొనసాగినంత కాలం పిఠాపురం నుంచి వర్మకు టీడీపీ సీటు దక్కే అవకాశం లేదు. పవన్ అక్కడే కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, పిఠాపురంలో వర్మ కేంద్రంగా సాగే రాజకీయం పైన కూటమి పార్టీల్లో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+