పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 7 వేలు..!!

రైతులకు గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా వేచి చూస్తున్న పీఎం కిసాన్ నిధుల జమ ముహూర్తం పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 19న 21వ విడత పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు రూ 7 వేలు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం ప్రభుత్వం తాజాగా రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం కిసాన్‌) యోజన పథకం 21వ వాయిదా సొమ్ము ఈ నెల 19న రైతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ఈ సొమ్మును ప్రధాని మోదీ విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు. కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి ఆగస్టు 2న రూ 5 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.

pm-kisan-annadata-sukhibava-funds-to-credit-in-farmers-accounts-on-19th

ఇక, ఇప్పుడు రెండో విడత నిధులను పీఎం కిసాన్ 21వ విడత తో కలిపి జమ చేయనుంది. రెండో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 5 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. రెండో విడత నిధులను ఈ నెల 19న పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేయటం ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లో రూ 7 వేలు జమ కానున్నాయి. మూడో విడత ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.

కాగా.. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతుల భూమి వివరాలు తప్పనిసరిగా పీఎం-కిసాన్ పోర్టల్‌లో నమోదై ఉండాలి. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించిన రైతులకే 21వ విడత నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయి. ఇక.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in వెళ్లి ఈ-కేవైసీ ఆప్షన్​పై క్లిక్​చేయండి. మీ ఆధార్​నంబర్​ను ఎంటర్​చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్​ నెంబర్ కు ఓటీపీ వస్తుంది, దానిని సబ్మిట్ చేయండి. సమీపంలోని కామన్​సర్వీస్​సెంటర్​(CSC) సెంటర్​కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పడలేదంటే మీరు ఈ - కేవైసీ చేయించలేదన్నట్లుగా భావిస్తారు. దీంతో, ప్రతీ లబ్దిదారుడికి ఈ విధానం తప్పని సరి చేసారు. దీని ద్వారా అర్హత ఉన్న ప్రతీ ఒక్కిరికీ పథకం అందుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+