చంద్రబాబు మరో వినతిని అంగీకరించిన మోడీ ! ఉత్తర్వులు జారీ..!
ఏపీలో కూటమిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. కేంద్రంలోనూ టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రులుగా అవకాశం దక్కింది.
ఈ నేపథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వానికి ప్రధాని మోడీ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఓ కీలక విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్రం ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటికే ఉన్న సీఎస్ జవహర్ రెడ్డిని తప్పుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు కొత్త సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను ఎంచుకున్నారు. అయితే నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో మరో ఆరు నెలలు పొడిగింపు ఇవ్వాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. దీనికి కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ డీవోపీటీ అంగీకరించింది.
ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు అంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఈ అనుమతి ఇస్తున్నట్లు అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం వెసులుబాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త సీఎస్ ను ఎంచుకునేందుకు ఆరు నెలల పాటు వెసులుబాటు లభించినట్లయింది.
Download











Click it and Unblock the Notifications