ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఈ రోజు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోదీ అభిమానులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారింది .రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు చాల మంది అంతర్జాతీయ ప్రముఖులు విషెస్ చెప్తున్నారు . రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ తో పాటు , అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ , అరవింద్ కేజ్రీవాల్ , రాహుల్ గాంధీ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు .

ప్రధాని మోదీకి వైఎస్ జగన్ , కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీజీ ... మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు . ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ 70వ వసంతంలోకి అడుగు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,తెలంగాణ ప్రజల తరఫున సీఎం కేసీఆర్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి మోదీ మరిన్ని సేవలు అందించాలని సీఎం ఆకాంక్షించారు.

తెలంగాణా గవర్నర్ , చంద్రబాబు విషెస్
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి ప్రధాని మోదీ గొప్ప సంపద అని ఆమె మోదీ గొప్పతనాన్ని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పిన ఆయన క్లిష్ట సమయంలో దేశాన్ని సమర్థంగా నడిపించే శక్తి భగవంతుడు మోదీకి ఇస్తాడని ఆశిస్తున్నా.. మీకు నా శుభాకాంక్షలు ఉంటాయి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Recommended Video

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు మీకు మా అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు . మీ ఘనమైన,స్ఫూర్తినిచ్చేఅంకిత భావం కలిగిన నాయకత్వంలో మన భరతమాత విప్లవ ముని శ్రీ అరబిందో కలలు కన్న విధంగా తన నిజమైన కీర్తి శిఖరాలను తాకగలదని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు . మోదీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలో సేవా సపత్ అనే కార్యక్రమం ద్వారా పేదలకు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు బిజెపి నేతలు.












Click it and Unblock the Notifications