చంద్రబాబును చూసి నేర్చుకోండి-ప్రధాని మోడీ ఫిదా..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పరస్పరం ప్రశంసలు కురిపించుకుంటున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి దాన్ని రిపీట్ చేశారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ భేటీ ఇందుకు వేదికైంది. ఇందులో చంద్రబాబు చేసిన ప్రజెంటేషన్ ప్రధాని మోడీని మంత్ర ముగ్ధుడిని చేసింది. దీంతో ఆయన ఈ భేటీకి హాజరైన ఇతర రాష్ట్రాలను చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలంటూ సూచించారు.
ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు హాజరు కాగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇందులో వికసిత్ భారత్ కు సంబంధించి రాష్ట్రాలు తమ సూచనలు, సలహాలను పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో సీఎం చంద్రబాబు కూడా తన వంతుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో తాను అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంతో పాటు ఎన్డీయే ప్రభుత్వాల ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి అంశాలను కూడా చంద్రబాబు వివరించారు. అలాగే రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కేంద్రం సహకారం కోరారు.

ఈ భేటీలో వికసిత్ భారత్ సాకారంలో భాగంగా ఏపీకి సహకరించాలని ప్రధాని మోడీకి చంద్రబాబు విన్నవించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగా నాలుగు జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారుల. ఇదే మోడల్ ను అమరావతి, కర్నూలు, తిరుపతికి కూడా విస్తరించేలా కేంద్రం సాయం చేయాలన్నారు. డిజిటల్ పాలనను అమలు చేస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ పాస్ బుక్ కూడా ఇస్తామన్నారు.

అనంతరం చంద్రబాబు ప్రజెంటేషన్ ను పూర్తిగా విన్న ప్రధాని మోడీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. వికసిత్ భారత్ కోసం చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. చంద్రబాబు ఇచ్చిన సూచనల్ని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని ప్రదాని మోడీ సూచించారు. చంద్రబాబు సూచనలు వికసిత్ భారత్ కు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. ప్రధాని మోడీతో పాటు ఈ భేటీకి హాజరైన ఇతర వక్తలు కూడా చంద్రబాబు సూచనల్ని స్వాగతించారు.












Click it and Unblock the Notifications