విశాఖ కేంద్రంగా ప్రధాని - చంద్రబాబు కీలక నిర్ణయం, అక్కడే ట్విస్ట్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీకి కేంద్రం నుంచి సహకారం కోసం చంద్రబాబు నేరుగా ప్రధానికి పలు వినతులు అందించారు. పీఎం సైతం సానుకూలంగా స్పందించారు. డిసెంబర్ లో విశాఖలో పర్యటన కోసం ప్రధానికి సీఎం ఆహ్వానించారు. విశాఖ కేంద్రంగా ఇద్దరు నేతలు కీలక అడుగుకు నిర్ణయించారు.

విశాఖకు ప్రధాని
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపైన చర్చించారు. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి రుణం పై చర్చలు..పురోగతి పైన ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. పోలవరం పనుల ప్రారంభం పైన తమ ఆలోచనలను పీఎం కు చంద్రబాబు వివరించారు. రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణాని కేంద్రం పచ్చజెండా ఊపింది. డిసెంబర్​లో ప్రధాని మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని పార్టీ ఎంపీలకు వెల్లడించారు.

PM Modi may attend the foundation laying ceremony of Railway Zone at Visakhapatnam

చంద్రబాబు భేటీలో
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి రైల్వే జోన్ కేటాయించాల్సి ఉంది. అనేక తర్జన భర్జనల తరువాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. జగన్ హాయాంలో భూ కేటాయింపు పైన అస్పష్టత కనిపించింది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన సమయంలో రైల్వే మంత్రి నేరుగా సీఎంతో సమావేశమయ్యారు. భూ కేటాయింపు అంశం పైన ఏపీ ప్రభుత్వం సంసిద్దత, ప్రతిపాదనలను చంద్రబాబు వివరించారు. డిసెంబర్ లో రైల్వే జోన్ కు శంకుస్థాపన చేసేందుకు ప్రధానిని ఆహ్వానించామని..అంగీకరించారని చెప్పుకొచ్చారు. ఈ లోగానే దీనికి సంబంధించి పరిపాలనా పరంగా ఆమోదించాల్సిన అంశాల పై ఫోకస్ చేయనున్నారు.

PM Modi may attend the foundation laying ceremony of Railway Zone at Visakhapatnam

స్టీల్ ప్లాంట్ పై ఎలా
విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన కు ప్రధాని వస్తున్న సమయంలోనే మరో అంశం చర్చకు కారణం అవుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివాదం కొనసాగుతోంది. తాజాగా కాంట్రాక్టు కార్మికుల అంశంలో తాత్కాలిక ఒప్పందం జరిగింది. అయితే, ప్లాంట్ కు నిధుల కేటాయింపు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశం పైన తాజాగా కార్మిక సంఘాల నేతలు ఉప ముఖ్యమంత్రి పవన్ ను కలిసారు. కేంద్రంతో చర్చిస్తామని పవన్ హామీ ఇచ్చారు. డిసెంబర్ లో ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పైన ఈ లోగానే స్పష్టత ఇస్తారా..ప్రధాని సమయంలో ఇచ్చేలా చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తారా అనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+